victory day
-
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
ఉక్రెయిన్ గడ్డ మీది ‘మాతృభూమి’ రక్షణ కోసమే.. : పుతిన్
అంచనాలను తలకిందులు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘విక్టరీ డే’ సందర్భంగా సాదాసీదా ప్రకటన చేశారు. సోమవారం మాస్క్ రెడ్ స్క్వేర్ దగ్గర వేలాది మంది సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారాయన. ఉక్రెయిన్ గడ్డ మీది ‘మాతృభూమి’ రక్షణ కోసమే రష్యా బలగాలు పోరాడుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. నాజీయిజానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ గడ్డపై పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచ యుద్ధంతో మరోసారి భయానక పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఆమోదయోగ్యం కాని ముప్పుతో రష్యా పోరాడుతోందని చెప్పిన పుతిన్.. అంతా ఊహించినట్లు యుద్ధంపై కీలక ప్రకటనేమీ చేయలేదు. అంతకు ముందు.. విక్టరీ డే వేదికగా పుతిన్.. యుద్ధాన్ని తీవ్రతరం చేయబోతున్నట్లు లేదంటే యుద్ధవిరమణ ప్రకటన చేయొచ్చంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే పుతిన్ మాత్రం ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాతృభూమి కోసం మీరంతా పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునే యత్నం చేస్తోంది. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ’’ అంటూ ప్రసంగించారాయన. ఈ సంక్షోభానికి.. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించిన పుతిన్.. కీవ్, దాని మ్రితపక్షాలు రష్యాకు చెందిన చారిత్రక ప్రాంతాలను(రష్యన్ భాష మాట్లాడే డోనాబస్ రీజియన్, క్రిమియా ప్రాంతాన్ని..) ఆక్రమించే యత్నం చేశాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మరో ఛాయిస్ లేదు. రష్యా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న సరైన నిర్ణయం అని మిలిటరీ చర్యను సమర్థించారాయన. ఇక నాజీ జర్మనీని ఓడించిన ఘట్టానికి సోమవారం నాటికి 77 ఏళ్లు వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రెడ్ స్క్వేర్ వద్ద పదకొండు వేల మంది సైన్యం, 130 మిలిటరీ వాహనాలతో భారీ ఎత్తున్న ప్రదర్శనలు నిర్వహించారు. #Putin said that #American veterans were not allowed to attend the Victory Parade in #Moscow. pic.twitter.com/fRbi7IvZm7 — NEXTA (@nexta_tv) May 9, 2022 చదవండి: తల్చుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం!! -
Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?
మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. సోవియెట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. ప్రతీ ఏడాది అదే రోజు విజయోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సైనిక పెరేడ్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ తేదీన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని, అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. యుద్ధం కీలక మలుపు తిరుగుతుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయోత్సవ వేడుకల్ని గత కొద్ది ఏళ్లుగా కొత్త దేశాలపై యుద్ధ ప్రకటనలు చేయడానికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మే 9న పుతిన్ చేసిన ప్రసంగంలో రష్యా శత్రువులందరూ తమ దేశాన్ని చుట్టుముట్టేస్తున్నారని, పశ్చిమ సిద్ధాంతాలను తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ఈ ఏడాది కూడా విక్టరీ డే నాడు పుతిన్ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి. మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది. పశ్చిమ దేశాల ఆందోళనలు ఎందుకు ? ఈ ఏడాది విక్టరీ డే రోజు పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యా వ్యవహారాల్లో నిపుణుడు సైమన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ అని చెబుతూ వస్తున్న పుతిన్ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యం’’ అని మిల్స్ అంచనా వేస్తున్నారు. యూదుడైన జెలెన్స్కీని ఉక్రెయిన్ గద్దె దింపి ‘‘నాజీరహితం’’ చేయడమే రష్యా లక్ష్యమన్న సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. మార్షల్ లా అమలు చేస్తారా ? ఈ ఏడాది విక్టరీ డే ప్రసంగంలో పుతిన్ మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. శిథిల ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై రష్యా నిర్విరామంగా దాడులు చేస్తూ 75 రోజులు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ చిన్న దేశంలో జరిగే నష్టం అపారంగా ఉంది. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ చేసిన అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 60 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో జరిగిన ఆర్థిక నష్టం 9,200 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. ► వ్యాపారాలు దెబ్బ తినడంతో వెయ్యి కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ► 195 ఫ్యాక్టరీలు, 230 ఆరోగ్య కేంద్రాలు, 940 విద్యా సంస్థలు, అయిదు రైల్వేస్టేషన్లు, 95 ప్రార్థనాలయాలు, 140 వారసత్వ, సాంస్కృతిక భవంతులు రష్యన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి ► 23,800 కిలోమీటర్ల రహదారులు నాశనమయ్యాయి. వీటి విలువే 6 వేల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా ► నెలకి 700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే తప్ప ఉక్రెయిన్ కోలుకునే పరిస్థితి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్ ఆర్మీ ఆసక్తికర ప్రకటన!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 30వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మ్డ్ బలగాల్లోని జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది. ⚡️Ukrainian army: Russia wants to end war by May 9. According to intelligence from the General Staff of the Armed Forces of Ukraine, Russian troops are being told that the war must end by May 9 – widely celebrated in Russia as the day of victory over the Nazi Germany. — The Kyiv Independent (@KyivIndependent) March 24, 2022 ఉక్రెయిన్ పౌరుల కిడ్నాప్! ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరు 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను (అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆంబుడ్స్మన్ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. -
బంగ్లా విముక్తి వీరులకు జోహార్లు: మోదీ
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ విముక్తి కోసం అలుపెరుగని పోరుసల్పిన బంగ్లా ఉద్యమ వీరులను ప్రధాని మోదీ శ్లాఘించారు. 1971లో పాక్‌తో యుద్ధంలో భారత్ గెలవడంతో బంగ్లాదేశ్ ఆవిర్భావం సాధ్యమైంది. ఈ విజయానికి సూచికగా భారత్‌లో ప్రతీ ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. ‘ బంగ్లా స్వాతంత్య్ర కోసం పోరాడిన యోధుల త్యాగాలను, పాక్‌పై కదనరంగంలో యుద్ధం చేసిన భారత సైనికులను స్మరించుకుందాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. విజయ్ దివస్‌లో భాగంగా మోదీ గురువారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వీరులకు నివాళులర్పించారు. విజయానికి గుర్తుగా ఏడాదికాలంగా దేశమంతా చుట్టొచ్చిన నాలుగు విజయజ్యోతి(విక్టరీ టార్చ్)లను యుద్ధస్మారక జ్యోతిలో ప్రధాని విలీనం చేశారు. వీరులకు పార్లమెంట్ ఉభయ సభలు ఘన నివాళులర్పించాయి. బంగ్లాతో మైత్రికే తొలి ప్రాధాన్యం: కోవింద్ బంగ్లాదేశ్‌తో మైత్రికే భారత్ తొలి ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. ఢాకాకు వెళ్లిన ఆయన గురువారం బంగ్లాదేశ్ విమోచన స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢాకాలో నేషనల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విక్టరీ పరేడ్ కార్యక్రమంలో బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలతోపాటు కోవింద్ హాజరయ్యారు. విజయోత్సవ వేడుకల్లో భాగంగా భారత్, బంగ్లా వాయుసేనలు సంయుక్తంగా వైమానిక విన్యాసాలు చేసి అబ్బురపరిచాయి. -
రష్యా విక్టరీ పరేడ్‌లో భారత సైనికులు
మాస్కో: భారత త్రివిధ దళాలకు చెందిన 75 మంది సైనికుల బృందం రష్యా విక్టరీ డే 75వ వార్షికోత్సవ పరేడ్‌లో పాల్గొనడం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని, ఇవి తనకు సంతోషకరమైన క్షణాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రష్యా అధినేత పుతిన్ సమక్షంలో రాజధాని మాస్కోలోని చరిత్రాత్మక రెడ్ స్క్వేర్‌లో బుధవారం జరిగిన ఈ పరేడ్‌కు రాజ్‌నాథ్ హాజరయ్యారు. 1941–1945 మధ్య వీరోచితంగా జరిగిన యుద్ధంలో సోవియట్ ప్రజల విజయానికి గుర్తుగా ఈ పరేడ్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ అడ్మిరల్ హరి కుమార్, భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మ పాల్గొన్నారు. రష్యా విక్టరీ పరేడ్‌లో రష్యా సైనిక దళాలతోపాటు 75 మంది భారత సైనికులు ముందుకు నడిచారు. మరో 17 దేశాలకు చెందిన సైనికులు కూడా పాలుపంచుకున్నారు. ఈ పరేడ్‌ను ఏటా మే 9న నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఈసారి జూన్‌లో నిర్వహించారు. -
అది భారత్ విజయమా, పాక్ విజయమా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో 1965లో జరిగిన యుద్ధం 50వ వార్షికోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఎందుకు ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఇంతవరకు ఎప్పుడు కూడా, ఏ భారత ప్రభుత్వం కూడా 1965 నాటి యుద్ధమే కాకుండా 1971లో మరోసారి పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాన్ని కూడా విజయోత్సవంగా జరుపుకోలేదు. కేవలం ఆ యుద్ధాల్లో మరణించిన అమర జవాన్లకు నివాళులు అర్పించేందుకు మాత్రమే పరిమతమైంది. మరి ఇప్పుడు ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు దాదాపు పాతిక రోజుల పాటు విజయోత్సవాలు జరుపుకోవాలని ఎందుకు నిర్ణయించింది? 1965లో పాకిస్తాన్, భారత్ మధ్య కేవలం 17 రోజులపాటే హోరాహోరీ యుద్ధం జరిగితే, ఎందుకు పాతిక రోజులు విజయోత్సవాలు జరుపుతున్నారనే అనుమానం ఎవరికైనా రావచ్చు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ప్రత్యక్ష యుద్ధం జరగ్గా, ఎందుకు ఆగస్టు 28వ తేదీనే భారత విజయోత్సాహంగా పరిగణిస్తున్నాం? పాకిస్తాన్ సెప్టెంబర్ ఆరవ తేదీని భారత్‌పై విజయంగా కాకుండా ‘డిఫెన్స్ డే’గా జరుపుకుంటోంది. ఎందుకు ఇరు దేశాలు 1965లో జరిగిన యుద్ధంలో తాము గెలిచామంటే తామే గెలిచామంటూ ఈ రోజు వరకు భుజాలు ఎగరేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగినది యుద్ధమేనా? అసలేం జరిగింది? ఏ దేశాల మధ్య యుద్ధం జరిగిన ముందుగా ఆయా దేశాల మధ్య దౌత్య కార్యాలయాలు మూతపడతాయి. గోప్యంగా ఉంచాల్సిన ఫైళ్లను వీలుంటే మాతృదేశాలకు తరలిస్తారు. అలాంటి అవకాశం లేనప్పుడు వాటిని తగల పెడతారు. 1965లో ఇటు భారత్‌లో పాకిస్థాన్ ఎంబసీగానీ, అటు పాకిస్థాన్‌లో భారత ఎంబసీగానీ మూతపడలేదు. సరిహద్దుల్లో జరుగుతున్నది సాధారణంగా జరిగే కాల్పులా లేక యుద్ధమా అన్న విషయం సంధి కుదిరినాకా కూడా ఇరు దేశాల రాయబారులకు తెలియదు. యుద్ధ సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీలో భారత హై కమిషనర్‌గా పని చేసిన కేవల్ సింగ్ ఇలాంటి సందేహాలే వ్యక్తం చేశారు. యుద్ధం విషయంలో తనకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో తన డిప్యూటీ కమిషనర్‌ను పాకిస్తాన్ విదేశాంగ శాఖ వద్దకు పంపించారు. ఆశ్చర్యంగా తాము కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సమాధానం వచ్చింది. ఎప్పటికీ సమాధానం రాలేదు. ఈ విషయాన్ని కేవల్ సింగ్ ‘పార్టిషన్ అండ్ ఆఫ్టర్‌మాథ్: మెమర్స్ ఆఫ్ ఎన్ అంబాసిడర్’ అనే పుస్తకంలో రాశారు. అదే సమయంలో ఢిల్లీలో డిప్యూటీ హైకమిషనర్‌గా వున్న అఫ్జల్ ఇక్బాల్ కు కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయి. వాటిని నివృత్తి చేసిన వాళ్లు ఎవరూ లేరు. తర్కం కోసం నాడు జరిగింది యుద్ధమే అనుకున్నా....అందుకు కారణం ఏమిటి? భారత్ ఎందుకు ఆగస్టు 28వ తేదీని యుద్ధం విజయోత్సాహంగా జరుపుకుంటోంది ? ఈ ప్రశ్నలకు కూడా చరిత్ర సమాధానం చెబుతోంది. కాశ్మీర్‌లోని ‘హాజి ఫిర్ పాస్’ వ్యూహాత్మకంగా భారత్‌కు కావాల్సిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఆక్రమించకున్నట్టయితే కాశ్మీర్, శ్రీనగర్ మధ్య ఎందో దూరం తగ్గుతుంది. అంతేకాకుండా 'హాజి ఫిర్ పాస్’ పాక్ తీవ్రవాదులకు అడ్డాగా ఉండేది. 'హాజి ఫిర్ పాస్’ను ఆగస్టు 28వ తేదీన భారత సైన్యం ఆక్రమించుకుంది. దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎదురుదాడిని ప్రకటించింది. ఆరవ తేదీన భారత సైనిక దళాలకు వ్యతిరేకంగా ప్రత్యేక పోరుకు దిగింది. అందుకనే ఆ దేశం ఇప్పటికీ విజయోత్సవ దినోత్సవంగా కాకుండా ‘డిఫెన్స్ డే’గా జరుపుకుంటోంది. అప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా వున్న హెచ్‌బీ చవాన్ సెప్టెంబర్ ఆరవ తేదీన లోక్‌సభలో మాట్లాడుతూ హాజీ ఫిర్ పాస్‌లో భారత సైనికులు ఉన్నట్లు అంగీకరించారు. సంఘర్షణ లేదా యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుండడంతో రష్యా, అమెరికా దేశాలు మధ్యవర్థిత్వం వహించి ఇరు దేశాల మధ్య ‘తాష్కంట్ ఒప్పందం’ కుదుర్చాయి. ఈ ఒప్పందం కింద ఆక్రమించుకున్న ‘హాజి ఫిర్ పాస్’ను తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించేందుకు అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహుదూర్ శాస్త్రీ అంగీకరించి డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అలాంటప్పుడు ‘హాజి ఫిర్ పాస్’ను భారత్ ఆక్రమించుకున్న రోజు మనకు ఎలా విజయోత్సవ దినం అవుతుంది. సంఖ్యల విషయంలో మనదే విజయమని చెప్పుకోవచ్చు. ఆ నాటి యుద్ధంలో 2,862 మంది భారత సైనికులు, 5,800 మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, భారత్ 97 యుద్ధ ట్యాంకులు, పాకిస్తాన్ 450 యుద్ధ ట్యాంకులు నష్టపోయాయి. భారత్ కోల్పోయిన 2,862 మంది అమర వీరులకు శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. -నరేందర్ రెడ్డి