gas station fire
-
రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి
మాస్కో: ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న ఒకపక్క ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో రష్యా తలమునకలై ఉండగా అంతలోనే మరో ఊహించని విపత్తు ఎదురైంది. కాకసాన్ రిపబ్లిక్ అఫ్ దగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. దగెస్తాన్ రిపబ్లిక్‌లోని ఓ గ్యాస్ స్టేషన్లో సంభవించిన భారీ పేలుడులో 35 మంది చనిపోగా మరో 115 మంది క్షతగాత్రులయ్యారు. దగెస్తాన్ రాజధాని మఖాచ్కాలా శివారులో సోమవారం రాత్రి ఈ పెను విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో 16 మంది చిన్నారులు సహా 65 మందిని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటగా కారు రిపేరు షెడ్డులో ప్రారంభమైన మంటలు సమీపంలోని గ్యాస్ స్టేషన్‌కు పాకడంతో పేలుడు సంభవించినట్లు అధికారులు వివరించారు. ఇటీవలి కాలంలో రష్యాలో సంభవించిన అతిపెద్ద పేలుడు ఘటన ఇదే. Dozens of people were killed in Russia's Dagestan region after a fire started at an auto repair shop on a highway and spread to a nearby gas station, officials said https://t.co/u8pA5Iyopa pic.twitter.com/GvHMhlYGMy — Reuters (@Reuters) August 15, 2023 ఇది కూడా చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే -
పెట్రోల్ బంక్‌లో పేలుడు: 200కి పెరిగిన మృతులు
అంకారా: ఘనా రాజధాని అంకారాలో బుధవారం రాత్రి పెట్రోల్ బంక్‌లో సంభవించిన పేలుడు, వరదల కారణంగా మృతుల సంఖ్య 200కి పెరిగింది. ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఘనాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశంలో మూడురోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దేశాధ్యక్షుడు జాన్ డ్రమని మహమా గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న సహయక చర్యలపై ఆయన ఆరా తీశారు. సహయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన సహాయక చర్యల కోసం రూ. 12 మిలియన్ల యూఎస్ డాలర్లు కేటాయించినట్లు మహమా ఈ సందర్భంగా వెల్లడించారు. అంకారాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వరలు సంభవించాయి. దాంతో వరదల నుంచి తప్పించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు పెట్రోల్ బంక్‌లో ఆశ్రయం పొందారు. అదే సమయంలో భూగర్భంలోని అయిల్ ట్యాంకర్లో నిల్వ ఉంచిన చమురు లీకైంది. దాంతో పేలుడు సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. అగ్నికీలలు పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో భవనాలకు వ్యాపించింది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అస్తవ్యస్తంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అవి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. -
పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం: 75 మంది మృతి
అంకారా: ఘనా రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక కుర్రుమ్హ్ సర్కిల్ వద్ద పెట్రోల్ బంక్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 75 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. నగరంలోని వివిధ ఆసుపత్రుల్లోక్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని మీడియా వెల్లడించింది. మృతులు, క్షతగాత్రులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఘనా జాతీయ అగ్నిమాపక సర్వీస్ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ అగ్నిప్రమాదంలో పెట్రోల్ బంకు పరిసర ప్రాంతాల్లోని నిలిపి ఉంచిన వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయని మీడియా పేర్కొంది.