పెట్రోల్ బంక్లో పేలుడు: 200కి పెరిగిన మృతులు
అంకారా: ఘనా రాజధాని అంకారాలో బుధవారం రాత్రి పెట్రోల్ బంక్లో సంభవించిన పేలుడు, వరదల కారణంగా మృతుల సంఖ్య 200కి పెరిగింది. ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఘనాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశంలో మూడురోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దేశాధ్యక్షుడు జాన్ డ్రమని మహమా గురువారం సాయంత్రం ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న సహయక చర్యలపై ఆయన ఆరా తీశారు. సహయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన సహాయక చర్యల కోసం రూ. 12 మిలియన్ల యూఎస్ డాలర్లు కేటాయించినట్లు మహమా ఈ సందర్భంగా వెల్లడించారు.
అంకారాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వరలు సంభవించాయి. దాంతో వరదల నుంచి తప్పించుకునేందుకు భారీ సంఖ్యలో ప్రజలు పెట్రోల్ బంక్లో ఆశ్రయం పొందారు. అదే సమయంలో భూగర్భంలోని అయిల్ ట్యాంకర్లో నిల్వ ఉంచిన చమురు లీకైంది. దాంతో పేలుడు సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి.
అగ్నికీలలు పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో భవనాలకు వ్యాపించింది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అస్తవ్యస్తంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అవి ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.