పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం: 75 మంది మృతి
అంకారా: ఘనా రాజధాని అంకారాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక కుర్రుమ్హ్ సర్కిల్ వద్ద పెట్రోల్ బంక్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 75 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. నగరంలోని వివిధ ఆసుపత్రుల్లోక్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని మీడియా వెల్లడించింది.
మృతులు, క్షతగాత్రులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఘనా జాతీయ అగ్నిమాపక సర్వీస్ ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ అగ్నిప్రమాదంలో పెట్రోల్ బంకు పరిసర ప్రాంతాల్లోని నిలిపి ఉంచిన వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయని మీడియా పేర్కొంది.