పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ స్టేట్, స్థానిక టెర్రరిస్ట్ సంస్థల్లో మాత్రమే ఇప్పటివరకు హైదరాబాద్ యువత పేరు వినిపించేది. తాజాగా కశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాదుల్లో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహ్మద్ తౌఫీఖ్ ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.