ఉగ్ర ముష్కరుల బీభత్సం
నాలుగు దేశాల్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. టర్కీ, ఈజిప్టు, సొమాలియా, నైజీ రియాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. దాడుల్లో మొత్తం 80 మంది బలవగా, 200 మంది గాయపడ్డారు. టర్కీ దాడి తమ పనేనని కుర్దిస్తాన్ ఫ్రీడమ్ ఫాల్కన్‌స, సొమాలియా దాడి తాము చేశామని అల్‌కాయిదా అనుబంధ షబాబ్ గ్రూప్ చెప్పాయి. ఈజిప్ట్ పేలుడుకు కారణం స్థానిక జీహదీలని భావిస్తున్నారు.
ఈజిప్టులో 25 మంది..
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలోని సెరుుంట్ మార్క్స్ కెథడ్రల్‌కు అనుకొని ఉన్న సెయింట్ పీటర్ చర్చిపై ఆదివారం శక్తిమంతమైన బాంబు దాడి జరిగింది. 25 మంది మృతిచెందగా, 49 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. అంతా ప్రార్థనల్లో ఉన్నప్పుడు బాంబు పేలింది. ప్రార్థనల సమయంలో ఓ మహిళే ఈ బాంబును అమర్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు స్థానిక పత్రిక పేర్కొంది. ఈ దాడి ఎవరు చేసింది ఇంకా తెలియలేదు. అరుుతే జిహాదిస్టులు తరచూ స్థానిక క్రైస్తవ మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారు.
టర్కీలో 38 మంది..
ఇస్తాంబుల్: టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఫుట్‌బాల్ మైదానం సమీపంలో శనివారం రాత్రి జరిగిన జంట పేలుళ్లలో 38 మంది మరణించగా, 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తయ్యాక స్టేడియం వెలుపల శక్తివంతమైన బాంబు పేలింది. తర్వాత పార్కులో పోలీసుల వద్ద ఆత్మాహుతి దాడి జరిడింది.
నైజీరియాలో బాలికల ఆత్మాహుతి దాడి
మైదుగురి: ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఆదివారం ఇద్దరు బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాగా, ఆత్మాహుతికి పాల్పడిన బాలికలు ఏడు, ఎనిమిది ఏళ్ల లోపు వారేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. రిక్షాల్లో మార్కెట్‌కు వచ్చిన ఇద్దరు బాలికలు పౌల్ట్రీ వైపు వెళ్లి, తమను తాము పేల్చుకోవడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు.
సోమాలియాలో 20 మంది..
మొగదిషు: సోమాలియా రాజ ధాని మొగదిషులో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారు. పోర్టు ప్రవేశమార్గం వద్ద ఉగ్రవాదులు ట్రక్కు బాంబు పేలుడుకు పాల్పడ్డారు.