linking procedure
-
పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా?
సాక్షి, ముంబై: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మీరు లింక్ చేయకపోతే వెంటనే పాన్‌తో ఆధార్ లింక్ చేయాలి. లేని పక్షంలో ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ కావు.అంతేకాదు ప్యాన్ చెల్లుబాటుకాదు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం కిందకు రాని పాన్ కార్డు హోల్డర్లందరూ వచ్చే ఏడాది మార్చి కి ( 31.3.2023) లోపు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. తరువాత నుంచి అంట 1.4.2023 నుండి లింక్ చేయని ప్యాన్ కార్డుపనిచేయదు. కనుక ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరగా లింక్ చేసుకోవడం బెటర్. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పలుమార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను 2023 మార్చి 31గా ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో హెచ్చరికను జారీ చేసింది. పాన్‌ను ఆధార్ తో అనుసంధానానికి విధించిన సాధారణ గడువు ముగిసిందని, అయితే గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. As per Income-tax Act, 1961, it is mandatory for all PAN holders, who do not fall under the exempt category, to link their PAN with Aadhaar before 31.3.2023. From 1.4.2023, the unlinked PAN shall become inoperative. The last date is approaching soon. Don’t delay, link it today! pic.twitter.com/OcvtJfewH2 — Income Tax India (@IncomeTaxIndia) December 10, 2022 (లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!) ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటీశ్వరులు..ఏకంగా 165 మందికి జాక్‌పాట్! ఎలా ? -
విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు
మాస్కో: క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గం.లకు ఓ ట్రక్కు పేలడం కారణంగా ఈ భారీ ప్రమాదం సంభవించింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విధ్యంసం కారణంగా వంతెన రెండు లైన్లు పాక్షికంగా కూలిపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాను కలిపే కీలక వంతెన భారీ కారు బాంబు పేలుడుతో ధ్వంసమైంది. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేపట్టింది. ఒక ట్రక్కును పేల్చివేయడంతోనే అగ్నికీలలు వ్యాపించినట్లు రష్యా పరిశోధన కమిటి పేర్కొంది. ఈ వంతెనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2018లో ప్రారంభించారు. ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ పేర్కొంది. పరిశోధన కమిటీ ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులెవరు వంటి వాటిపై ముమ్మరంగా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7 — Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో.. కారులో బర్గర్ తింటున్న యువకుడిపై పోలీసు కాల్పులు) -
గుడ్‌న్యూస్: పాన్- ఆధార్ గడుపు పెంపు
న్యూఢిల్లీ : పాన్- ఆధార్ కార్డ్ లింక్ గడువును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా సార్లు దీని గడువును పొడిగించిన కేంద్రం.. తాజాగా సోమవారం మరోసారి పొడగించింది. రేపటితో (మంగళవారం) గడువు ముగుస్తుండగా.. వచ్చే ఏడాది (2021) మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా వైరస్ దృష్ట్యా ఆదాయపు పన్నుశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీనిని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేకుంటే పాన్ కార్డు చెల్లదని ఐటీశాఖ ప్రకటించింది. -
ఇలా చేయకపోతే.. మీ పాన్ రద్దు
న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తారా? పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్ లింకుచేయకపోతే పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇన్‌కం టాక్స్ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఛైర్మన్ సుశీల్ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో సిబిడిటి ఛైర్మన్ ఈ హెచ్చరిక చేశారు. బయోమెట్రిక్ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని సిబిడిటి ఛైర్మన్ తెలిపారు. అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ సేవలకు పాన్ లింకింగ్ తప్పనిసరి కాదు. -
ఆధార్ లింకింగ్..భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ సంక్షేమ పథకాలతోపాటు, ఇతర సేవలకోసం ఆధార్ లింకింగ్‌పై సుప్రీంకోర్టు భారీ ఊరట నిచ్చింది. ఆధార్ అనుసంధాన ప్రక్రియ గడువును మార్చి 31, 2018 వరకు పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అన్ని సేవలకు ఆధార్‌నంబర్ అనుసంధాన గడువును మార్చి 31వ తేదీకి పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల బెంచ్ శుక్రవారం ఈ విషయంపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల ఆధార్ లింకింగ్ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ నంబర్ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆధార్ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్ ఆధార్‌లింకింగ్ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది. -
60సెకన్లలో పాన్-ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీచేసిన ఆదేశాల ప్రకారం ఆధార్‌తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను లింకు చేయడం జులై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. జులై 1, 2017లోపు పాన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్‌తో లింకు చేయాల్సిందేనని ఆదాయ శాఖ స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల 7 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ తమ పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ లింకింగ్ ప్రక్రియ ఎలాగో ఒకసారి చూద్దాం. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారయితే ఇన్ కమ్ టాక్స్ కట్టే వాళ్లు అయితే..మీరు ఇదివరకే రిజిస్టర్డ్ యూజర్ అయితే.. www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ (Registerd User Login Here).. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. యూజర్ ఐడి, పాస్ వర్డ్ తోపాటు అక్కక డిస్ప్లే అయ్యే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ తో పాన్ ను లింక్ చేసే ఫారమ్ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే .. సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అనే మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.. ఒకవేళ మీరు రిజిస్టర్డ్ యూజర్స్ కాకపోతే... www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ (New to e-filling Register yourself) అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేయండి. మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. తర్వాత ఆ వివరాలతో లాగిన్ అయి.. ఆధార్, పాన్ ను లింక్ చేయండి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి వీరికి ఈ ప్రక్రియ మరింత సులువు..మొత్తం కేవలం 60 సెకన్లలో పూర్తవుతుంది. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో కి వెళ్లాలి. ఆధార్ లింకింగ్ విత్ పాన్ మేడ్సింపుల్..క్లిక్ హియర్ (Aadhaar Linking With Pan Made Simple.. Click Here) అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.. తర్వాత త్రి కాలమ్స్‌తో ఉన్న టేబుల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వున్న ప్రకారం నిర్దేశిత కాలమ్ లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అంతే... స్క్రీన్ పై సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ (Successfully Aadhaar Linked with Pan) అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్ రాకపోతే మనం ఎంట్రీ చేసిన వివరాలను మళ్లీ ఒకసారి సరి చూసుకుంటే..చాలు. ఆధార్ ను పాన్ తో లింక్ పూర్తవుతుంది.