Indian Bridge Team Is Safe In Pakistan, Will Play In Tournament Till May 13: BFI Chief - Sakshi
Sakshi News home page

పాక్‌లో పర్యటిస్తున్న టీమిండియా సేఫ్‌.. వదంతులు నమ్మవద్దు

Published Thu, May 11 2023 5:10 PM | Last Updated on Thu, May 11 2023 6:20 PM

Indian Bridge Team Is Safe In Pakistan, Will Play Entire Tournament Says BFI Chief - Sakshi

బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియా అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌ (BFAME) ఆర్గనైజ్‌ చేస్తున్న 22వ ఆసియా మరియు మిడిల్‌ ఈస్ట్‌ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న 32 మంది సభ్యుల భారత బ్రిడ్జ్‌ జట్టు సురక్షితంగా ఉందని బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) చీఫ్‌ సుతాను బెహురియా వెల్లడించారు. టీమిండియా టోర్నీ ముగిసిన తర్వాతే (మే 13) భారత్‌కు బయల్దేరుతుందని ఆయన స్పష్టం చేశారు. 

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత పాక్‌లో చెలరేగుతున్న అల్లర్లలో భారత బృందం అవస్థలు పడుతుందని, టోర్నీ పూర్తికాకుండానే టీమిండియా భారత్‌కు బయల్దేరిందని వస్తున్న వదంతుల నేపథ్యంలో బెహురియా ఈ మేరకు స్పందించారు. సోషల్‌మీడియాలో జరుగుతున్నది ఫేక్‌ ప్రచారమని కొట్టిపారేశారు. భారత బృందం హోటల్‌లో సేఫ్‌గా ఉందని, పాక్‌ భద్రతా యంత్రాంగం ప్రత్యేక దళాలను మొహరించి టీమిండియాకు సెక్యూరిటీ ఇస్తుందని తెలిపారు. 

కాగా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్‌ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తదనంతర​ పరిణామాల్లో పాక్‌ అంతటా అల్లర్లు చెలరేగుతున్నాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. అనేక నగరాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రజా ఆస్తులు విధ్వంసానికి గురవుతన్నాయి. భద్రతా దళాలు కాల్పుల్లో పలువురు ప్రాణాల సైతం​ కోల్పోయారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పాక్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది.

చదవండి: టీమిండియాను వెనక్కునెట్టిన పాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement