టొరెంటో: కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఇరుదేశాల మధ్య సరిహద్దును దిగ్బంధిస్తున్న ఆందోళనకారులపై ఫెడరల్ అధికారాలను ఉపయోగించాలని బైడెన్ ప్రభుత్వం ట్రూడో ప్రభుత్వాన్ని కోరింది. ట్రక్కులను చేర్చి సరిహద్దులను అడ్డుకోవడంతో ఇరువైపులా ఉన్న ఆటో ప్లాంట్లు మూసివేయాల్సివస్తోందని తెలిపింది. ఫ్రీడం కాన్వాయ్ పేరిట నిరసనకారులు వరుసగా నాలుగో రోజు కూడా ట్రక్కులను అంబాసిడర్ వారధి (కెనెడా, అమెరికాలను కలిపే వారధి)పై నిలిపి నిరసనలు కొనసాగించారు. దీనిపై అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో, రవాణా కార్యదర్శి పీట్ కెనెడా అధికారులతో మాట్లాడారు. సరిహద్దులను క్లియర్ చేసేందుకు రాయల్ కెనడియన్ పోలీసులను పంపిస్తున్నట్లు కెనెడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో చెప్పారు. మరోవైపు ప్రతిపక్షాలతో కెనెడా ప్రధాని ట్రూడో ఆన్‌లైన్‌లో చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment