చదువులకు ‘బ్రిడ్జి’ వేద్దాం.. నష్టాన్ని అధిగమిద్దాం | Education Dept Will Introduce Bridge Courses In Ts Over Corona Pandemic | Sakshi
Sakshi News home page

చదువులకు ‘బ్రిడ్జి’ వేద్దాం.. నష్టాన్ని అధిగమిద్దాం

Published Thu, Jan 27 2022 3:29 AM | Last Updated on Thu, Jan 27 2022 10:49 AM

Education Dept Will Introduce Bridge Courses In Ts Over Corona Pandemic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కాలంలో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చటంపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లుగా విద్యాబోధన సరిగ్గా సాగే పరిస్థితి లేకపోవడం, అయినప్పటికీ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసిన నేపథ్యంలో వారి కోసం బ్రిడ్జి కోర్సు తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై త్వరలో సమీక్షించి వచ్చే విద్యా సంవత్సరంలో చర్యలు తీసుకోనుంది.

లోపించిన ఏకాగ్రత: గత రెండేళ్లుగా రాష్ట్రంలో 17,27,892 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకే పరిమితమయ్యారు. అయితే వారిలో 1,17,570 మంది పేద విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలు లేని కారణంగా ఆన్‌లైన్‌ పాఠాలు సైతం వినలేక పోయినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలు వెల్లడించాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ఎంతో కొంత విద్య అందు బాటులోకి వచ్చినా విద్యార్థుల అభ్యసన, పరిశీలన, ఆచరణలో పూర్తిగా మార్పులొచ్చాయనేది అనేక సర్వేలు నిరూపించాయి. కరోనా తర్వాత జాతీయ స్థాయిలో ‘నిసా’ అనే సంస్థ జరిపిన సర్వే ప్రకారం 30% మంది విద్యార్థులు మాతృభాషలో చదవ డంలో ఇబ్బందిపడుతున్నారు.

3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం పిల్లలు మాతృభాషలో రాయడంలోనూ వెనుకబడ్డారు. ఆంగ్ల భాషలో 35 శాతం మంది విద్యార్థులు పట్టుకోల్పోయారు. 19 శాతం మంది విద్యార్థులకు ఆంగ్లం చదవడం కష్టంగా కన్పిస్తోంది. 40 శాతం మంది గణితంలో సాధారణ సూత్రాలను కూడా గుర్తుతెచ్చుకోలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే బేసిక్స్‌పై దెబ్బకొట్టిన కరోనా వల్ల పైతరగతుల్లో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. పునాది గట్టిగా లేకపోవడం వల్ల హోంవర్క్‌ ఇచ్చినా చెయ్యలేని స్థితిలో ఉన్నారు. క్లాసుల్లో పాఠాలు అర్థం కావడం లేదని చెబుతున్నారు. దీనివల్ల సామర్థ్యం దెబ్బతింటోంది.

సలహాలు స్వీకరిస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ..
విద్యాభ్యాసంలో గత రెండేళ్లుగా విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు, ఉన్నతాధికారులు, సూచిస్తున్నారు. అన్ని కోణాల్లోంచి వస్తున్న సర్వేల నేపథ్యంలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) కూడా దృష్టి పెట్టింది. నష్టాన్ని పూడ్చడంపై అన్నివైపుల నుంచి సలహాలు తీసుకుంటోంది.

ఆచరణీయమైన ఆలోచన తేవాలి..
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విద్యార్థులను ఆకర్షించేలా వారు మర్చిపోయిన పాఠ్యాంశాలను బోధించే ప్రయత్నం చేయాలి. దీన్నో సామాజిక బాధ్యతగా చేపట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇది సాధ్యం. కరోనా వల్ల మూలసూత్రాల అధ్యయనంలో నష్టం వాటిల్లింది. దీన్నే ప్రధానంగా బ్రిడ్జి కోర్సులో చేరిస్తే బాగుంటుంది.
– ఎస్‌.ఎన్‌.రెడ్డి, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement