హ్యూమెన్ బ్రిడ్జి
బీజింగ్ : మీరు ఏదైనా ఓ బ్రిడ్జిపై వెళుతుండగా అది కొద్దిగా అటు ఇటు కదిలిందనుకోండి, అప్పుడు మీకేం అనిపిస్తుంది. మొదటగా గుండె ఝల్లుమంటుంది.. ఎంత వీలైతే అంత త్వరగా బ్రిడ్జిపైనుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది. అదే బ్రిడ్జి ఊయలలాగా ఊగితే పరిస్థితి?. అచ్చం ఇలాంటి పరిస్థితే చైనాలోని కొంత మందికి ఎదురైంది. గత మంగళవారం దక్షిణ చైనా.. గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హ్యూమెన్ బ్రిడ్జిపై విపరీతంగా ట్రాపిక్ ఉన్న సమయంలో.. ‘ లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెను గా..’’ అన్నట్లు ఊగిందా బ్రిడ్జి. దీంతో దానిపై వెళుతున్న వారు బిక్కచచ్చి పోయారు. బ్రిడ్జి అలా ఊగటం చూసి, అది ఎప్పుడు కూలుతుందోనని భయపడిపోయిన ట్రాఫిక్ అధికారులు దాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ( ‘ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉంది’ )
అయినప్పటికి బ్రిడ్జి ఊగటం అయితే ఆపలేదు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన అధికారులు బ్రిడ్జికి ఎలాంటి నష్టం కలగలేదని తేల్చారు. అయితే పెనుగాలుల కారణంగానే బ్రిడ్జి ఊగుతోందని స్థానిక అధికారులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ డేంజర్.. ఆ బ్రిడ్జిమీదకు వెళ్లకండి!.. బ్రిడ్జి అలా ఊగటం చూడగానే నాకు రెంటికొచ్చేసింది..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఇంట్లో ప్రత్యక్షమైన రెండు తలల పాము )
Comments
Please login to add a commentAdd a comment