హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వద్ద ఉషా ముల్లపూడి కమాన్ సమీపంలో బిజీగా ఉన్న రోడ్డుపై ఒక్కసారిగా భారీ గొయ్యిపడింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇంతకు ముందు సైతం నగరంలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద ఇదే తరహాలో రోడ్డుపై ఒక్కసారిగా గుంత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు భారీ వర్షాల మూలంగా అలా జరిగిందని సర్థిచెప్పుకున్నా.. కూకట్‌పల్లి ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.