సినిమా స్టంట్ సీన్‌ను తలపించేలాంటి ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రగతి నివేదన సభ’’ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు చేశారు. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు ఓకే రహదారిపై జరిగాయి.దీంతో రహదారిపై వెళుతున్న ఓ బైక్ ఎదురుగా వస్తున్న మినీ ట్రక్కును ఢీ కొట్టగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి కొన్ని అడుగులపైకి గాల్లోకి పల్టీలు కొట్టి నేలను తాకాడు. శరీరం రోడ్డును తాకినప్పటికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అతడు వెంటనే లేచి బైక్ దగ్గరకు చేరకున్నాడు. రోడ్డుపై వెళుతున్న కొద్దిమంది అతనికి సహాయం చేయటానికి చుట్టూ చేరారు.
సినిమా స్టంట్ సీన్‌ను తలపించేలా..
Published Sun, Sep 2 2018 8:52 PM | Last Updated on Wed, Mar 20 2024 3:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement