కుప్పకూలిన బ్రిడ్జి | concrete bridge collapsed onto the road below in italy | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన బ్రిడ్జి

Published Mon, Oct 31 2016 1:38 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

కుప్పకూలిన బ్రిడ్జి

కుప్పకూలిన బ్రిడ్జి

ఓ భారీ వాహనం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది

మిలాన్: కాలం చెల్లిన బ్రిడ్జ్ రద్దీగా ఉన్న రోడ్డుపై కూలిపోయిన ఘటన ఇటలీలోని లెకొ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం 108 టన్నుల ఓ భారీ వాహనం వెళ్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో బ్రిడ్జి కింద రోడ్డుపై వెళ్తున్న కారు నుజ్జునుజ్జవడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.

అక్కడి రోడ్లను నిర్వహిస్తున్న ఏఎన్ఏఎస్ కంపెనీ ప్రతినిధులు దీనిపై స్పందిస్తూ.. కూలిపోయే అవకాశం ఉన్నందున తాము గతంలోనే ఈ బ్రిడ్జిని మూసివేయాలని చెప్పామని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీనిపై సంబంధిత శాఖా మంత్రి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement