అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్‌ పిల్లర్‌.. కారు​, ట్యాంకర్‌ ధ్వంసం | Under Construction Flyover Pillar Collapse At Anakapalli National Highway | Sakshi
Sakshi News home page

అనకాపల్లి: కూలిన ఫ్లైఓవర్‌ పిల్లర్‌.. కారు​, ట్యాంకర్‌ ధ్వంసం

Published Tue, Jul 6 2021 6:44 PM | Last Updated on Tue, Jul 6 2021 8:39 PM

Under Construction Flyover Pillar Collapse At Anakapalli National Highway - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ పిల్లర్‌ కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్‌ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్‌ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. విచారకర అంశం ఏంటంటే ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఈ హైవే విస్తరణ పనులు కొనసాగతున్నాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈ ప్రమాదంలో విశాఖ శ్రీహరిపురంకు చెందిన సతీష్ కుమార్, సుశాంత్ మహంతిలు మృతి చెందారు. కారులో వెనక కూర్చున్న మృతుల భార్యలు సునీత, లక్ష్మిలను స్థానికులు కాపాడారు. ఇక వీరిలో సునీత గర్భిణీ. బాధితులంగా అనకాపల్లి శ్రీ నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఈ రెండు కుటుంబాలు ఉపాధి రీత్యా శ్రీహరిపురంలో నివాసం ఉంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement