అనకాపల్లి ఫ్లైఓవర్‌ దుర్ఘటన: నేషనల్ హైవే అథారిటీ విచారణ | National Highway Authority Inquiry on Anakapalle Flyover Accident | Sakshi
Sakshi News home page

అనకాపల్లి ఫ్లైఓవర్‌ దుర్ఘటన: నేషనల్ హైవే అథారిటీ విచారణ

Published Wed, Jul 7 2021 10:39 AM | Last Updated on Wed, Jul 7 2021 10:46 AM

National Highway Authority Inquiry on Anakapalle Flyover Accident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి ఫ్లైఓవర్‌ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం 15 బీముల అమరిక, 2 బీములు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులు సతీష్‌కుమార్‌, సుశాంత్‌ మహంతిల మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించారు.

కాగా, జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్‌ బీమ్‌లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్‌ వద్ద ఫ్లై ఓవర్‌ పైభాగంలో అమర్చిన బీమ్‌లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్‌ ట్యాంకర్‌పై పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement