National Highway Authority
-
ఉత్తరాఖండ్ సీఎం, నేషనల్ హైవే అథారిటీ మధ్య డైలాగ్ వార్
-
రహదారి బాగుందా.. పగుళ్లు ఏర్పడ్డాయా?
వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండల పరిధిలోని జాతీయ రహదారి 44ను గురువారం సాయంత్రం నేషనల్ హైవే అథారిటీ చీఫ్ ఇంజనీర్ రోషన్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. రహదారి బాగుందా.. ఎక్కడైనా పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయా, రహదారిపై వంతెనలు సర్వీస్ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. రోడ్డుపై అక్కడక్కడ మట్టి పేరుకుపోవడాన్ని గమనించారు. మాసాయిపేట శివారులో ఓ దాబా నిర్వాహకులు సర్వీస్ రోడ్డును ఆక్రమించి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పరిస్థితిపై నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
పెంబర్తి వరకు పచ్చదనమే...
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయ రహదారి (163)పై పెంబర్తి వరకు ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీ’ని పొడిగించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుతం రాయగిరి వరకు ఉన్న గ్రీనరీని సుమారు రూ.5 కోట్ల వ్యయంతో పెంబర్తి వరకు మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్‌రింగ్‌రోడ్డు, వరంగల్ హైవే వెంట పెంచిన ప్లాంటేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హెచ్ఎండీఏ గ్రీనరీపై ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైతం అధ్యయనం చేసింది. ♦యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వరంగల్ హైవే మార్గంలో గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం గ్రీనరీ పెంపుదలకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సూచించారు. ♦ఈ మేరకు ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు గతంలో నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో, 30 కిలోమీటర్ల పొడవున పూర్తి చేశారు. ♦దీంతో ఈ మార్గం ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోంది. ఈ గ్రీనరీని తాజాగా పెంబర్తి వరకు పొడిగించనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీనరీపైన నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్ (ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య ప్రత్యేకంగా అధ్యయనం చేయడం గమనార్హం. -
అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ
-
అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటన: నేషనల్ హైవే అథారిటీ విచారణ
సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి ఫ్లైఓవర్ దుర్ఘటనపై నేషనల్ హైవే అథారిటీ విచారణ చేపట్టింది. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 15 బీముల అమరిక, 2 బీములు జారిపడటంతో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఎన్హెచ్ఏఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతులు సతీష్‌కుమార్, సుశాంత్ మహంతిల మృతదేహాలను వారి కుటుంబానికి అప్పగించారు. కాగా, జాతీయ రహదారుల విస్తరణ, అనుసంధాన ప్రక్రియలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో చేపడుతున్న ఫ్లైఓవర్ బీమ్‌లు జారిపడడంతో మంగళవారం ఇద్దరు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మరో ముగ్గురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల మేరకు అనకాపల్లి నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో జలగలమదుం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ పైభాగంలో అమర్చిన బీమ్‌లు ఒక్కసారిగా జారి అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న ఒక కారు, ఆయిల్ ట్యాంకర్‌పై పడ్డాయి. -
హెరిటేజ్ ఎఫెక్ట్ రైతుల భూములకు ఎసరు
-
‘హెరిటేజ్’ కోసమే బైపాస్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో నేషనల్ హైవే అథారిటీ(ఎన్హెచ్ఏఐ) చేపట్టిన తిరుపతి–చిత్తూరు రహదారి విస్తరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఈ మార్గంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ భూములను భూసేకరణ నుంచి తప్పించేందుకు తమ భూములకు ఎసరు పెడుతున్నారని రైతులు మండి పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం తమను బలి చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములు కోల్పోతే ఇక ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. హెరిటేజ్‌కు మేలు చేసేందుకు రోడ్డు అలైన్మెంట్ మార్చేశారని, ఆ సంస్థ భూములను కాపాడడంతో పాటు వాటి విలువను భారీగా పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని విమర్శిస్తున్నారు. అసలేం జరిగింది? నాయుడుపేట నుంచి చిత్తూరు వరకూ ఉన్న రెండు వరుసల రహదారిని(ఎన్‌హెచ్–140) ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో చిత్తూరు–తిరుపతి మధ్యనున్న 61 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలో తిరుపతి–నాయుడుపేట మధ్యనున్న 55 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. ఒక్కో ప్యాకేజీకి రూ.1,200 కోట్లు కేటాయించింది. భూసేకరణ, పరిహారం చెల్లింపుల కోసం మరో రూ.300 కోట్లు కేటాయించింది. మొదటి ప్యాకేజీలో రెండు చోట్ల బైపాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ముంగిలిపట్టు నుంచి పనబాకం వరకూ (7.5 కిలోమీటర్లు) ప్రతిపాదించిన బైపాస్ రోడ్డు విషయంలో అధికారులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ భూములకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పడ్డారు. డెయిరీ ఆ భూముల విలువ రెట్టింపయ్యేలా అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు. హెరిటేజ్‌కు రెండు వైపులా రోడ్లే ప్రస్తుతం హెరిటేజ్ డెయిరీ ప్రధాన గేటుకు ముందుగా తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి వెళ్తోంది. ఈ ప్రాంతంలో (కాశిపెంట్ల) రోడ్డును ఆరు వరుసలుగా విస్తరించాలంటే కుడి వైపున రైల్వే లైన్, ఎడమ వైపున హెరిటేజ్ డెయిరీ సరిహద్దులు ఉన్నాయి. రైల్వే లైన్ వైపు విస్తరణకు అవకాశం లేదు కాబట్టి ఎడమ వైపునే ఎక్కువ భూమిని సేకరించాలి. అదే జరిగితే హెరిటేజ్ స్థలం చాలావరకు భూసేకరణ కింద పోవడం ఖాయం. దీంతో అధికారులు ఇక్కడ బైపాస్ అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం ఏడున్నర కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో బైపాస్ రోడ్డు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి–చిత్తూరు రెండు వరుసల రహదారి నుంచి ముంగిలిపట్టు దగ్గర చీలే బైపాస్ రోడ్డు హెరిటేజ్ డెయిరీ వెనుకగా వెళ్లి పనబాకం రైల్వేస్టేషన్‌కు ముందు మళ్లీ పాత రోడ్డులో కలుస్తుంది. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే హెరిటేజ్ డెయిరీకి ముందు రెండు వరసలు, వెనుక ఆరు వరసల రహదార్లు ఉంటాయి. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెరిటేజ్ భూముల ధర భారీగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే అధికారులు బైపాస్‌ను తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బైపాస్ నిర్మాణానికి 300 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల 60 మందికి పైగా రైతులు తమ సాగు భూములను కోల్పోనున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను పోగొట్టుకుని ఎలా బతకాలని బాధిత రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న రైతులు న్యాయం కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు యథాతథ స్థితి(స్టేటస్ కో) ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కొన్నాళ్లపాటు భూముల సర్వే నిలచిపోయింది. అయితే, వారం రోజులుగా చంద్రగిరి, పాకాల మండలాల రెవెన్యూ అధికారులు బైపాస్ రోడ్డు పనుల కోసం రైతుల భూములను సర్వే చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సర్వే చేయడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రత్యామ్నాయం ‘బోనిత్తుల రోడ్డే.. బైపాస్ నిర్మాణం అనివార్యమని అధికారులు చెబుతుండగా, ఎప్పటి నుంచో వాడకలో ఉన్న బోనిత్తుల రోడ్డు ఇందుకు ఉపయోగించుకోవచ్చని రైతులు అంటున్నారు. ఈ రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూములే ఉన్నాయని, దీన్ని ఆరు లేన్లుగా విస్తరిస్తే ఎవరికీ నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. పొలం, ఇల్లు పోతున్నాయి ‘‘నేను రిటైర్డ్ ఉద్యోగిని. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ సొంతింట్లో ఉంటున్నా. బైపాస్ కోసం భూసేకరణలో నా పొలం, ఇల్లు పోతున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. పనబాకంలో 30కి పైగా ఇళ్లు పోయే ప్రమాదం ఉంది’’ – డాక్టర్ జె.బాపూజీ, పనబాకం గ్రామం పొలమంతా పోతుంది ‘‘బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ జరిపితే నాకున్న 2.50 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం పోతుంది. ఆ భూమే నాకు జీవనాధారం. అది లేకుండా పోతే ఎలా బతకాలో తెలియడం లేదు. పెద్దలు భూములను కాపాడడానికి మాలాంటి పేదల భూములు లాక్కోవడం అన్యాయం’’ – ఎస్.జనార్దన్, రైతు, కొత్తిఇండ్లు గ్రామం -
20,000 కోట్లతో అమరావతి ఓఆర్ఆర్
కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)ను రూ.20,000 కోట్లతో చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఎరువులు, రసాయనాలు, షిప్పింగ్ శాఖల సహాయ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు. అమరావతి ఓఆర్ఆర్కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఆయన శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. డీసీఐఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు సంబంధించి 66 పనులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న విజయనగరం బైపాస్ నాలుగు లేన్ల విస్తరణకు రూ.430 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్‌లోని రహదారి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామన్నారు.