రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను రూ.20,000 కోట్లతో చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఎరువులు, రసాయనాలు,
కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)ను రూ.20,000 కోట్లతో చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఎరువులు, రసాయనాలు, షిప్పింగ్ శాఖల సహాయ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు. అమరావతి ఓఆర్‌ఆర్‌కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఆయన శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. డీసీఐఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు సంబంధించి 66 పనులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న విజయనగరం బైపాస్ నాలుగు లేన్ల విస్తరణకు రూ.430 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్‌లోని రహదారి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామన్నారు.