Mansuk mandaviya
-
Vinesh Phogat Row: రాజకీయ రగడ
ఢిల్లీ: ప్యారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత అంశం.. రాజకీయ రగడకు దారి తీసింది. ఈ అంశంపై లోక్‌సభలో చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనతో సంతృప్తి చెందని విపక్షాలు అభ్యంతరం చెబుతూ సభ నుంచి వాకౌట్ చేశాయి.వినేశ్ ఫోగట్ అనర్హతపై కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘అనర్హత అంశంలో తగు చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారు. ఈరోజు ఆమె బరువు 50 కిలోలు 100 గ్రాములు ఉన్నట్లు గుర్తించి అనర్హత వేటు పడింది. భారత ఒలింపిక్ సంఘం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉష పారిస్‌లో ఉన్నారు. ప్రధాని మోదీ ఆమెతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు’అని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు వ్యక్తిగత సిబ్బందితో సహా ప్రతి సౌకర్యాన్ని అందించిందని చెప్పారు. మరోవైపు.. క్రీడామంత్రి వివరణ ఇస్తున్న సమయంలో ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. అనంతరం నిరసనలు తెలుపుతూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM— ANI (@ANI) August 7, 2024మరోవైపు.. రాజ్యసభలో కూడా వినేశ్ ఫోగట్ అనర్హత అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు పట్టుపట్టారు. ఇదీ చదవండి: వినేష్ ఫోగట్ అనర్హత.. కుట్రా? కఠిన వాస్తవమా?ఫోగట్‌కు న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. అనంతరం రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ముందు రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు.#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT— ANI (@ANI) August 7, 2024కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు ఏం చేశారు: పంజాబ్ సీఎంవినేశ్ ఫోగట్ అనర్హతపై పంజాబ్ సీఎంభగవంత్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె బరవును చెక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులది. ఇప్పుడు అనర్హత పడింది. ఈ అన్యాయాన్ని ఆపాలి. ఇంత పెద్ద స్థాయిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులకు లక్షల్లో జీతం ఇస్తున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడికి వెళ్లారా?’ అని మండిపడ్డారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 వినేశ్‌పై అనర్హత విచారకరం: రాహుల్ గాంధీ ప్రపంచ చాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన వినేశ్ భారత్‌కు గర్వకారణం. సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం విచారకరం. భారత ఒలింపిక్ సంఘం ఈ నిర్ణయాన్ని గట్టిగా సవాలు చేస్తుందని ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో అన్నారు. పట్టు వదలకుండా ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే నమ్మకం ఉంది. వినేశ్ దేశం గర్వించేలా చేశావు. దేశం మొత్తం మీకు మద్దతుగా నిలుస్తోంది తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హావినేశ్ ఫోగట్ చాలా అర్హత నిబద్ధత గల క్రీడాకారిణి. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళ. ఆమె ఒక ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించారు. ఫైనల్స్‌లో మరొక ప్రపంచ ఛాంపియన్‌తో బరిలోకి దిగాల్సింది. ఆమె అనర్హత భారతీయులందరికీ, వినేష్ ఫోగట్ మద్దతుదారులందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని అన్నారు.#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, TMC MP Shatrughan Sinha says, "She is a very deserving and committed athlete. She became the first Indian woman to reach the wrestling finals in the Olympics. She defeated a world champion and… pic.twitter.com/3dFMnLKOAT— ANI (@ANI) August 7, 2024అనర్హత వేటు నేపథ్యంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ పలువురు రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. భారత దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొంటున్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో వినేశ్ ఫొగట్‌కు ప్రధాని మోదీ అండగా నిలిచారు. వినేశ్. మీరు ఛాంపియన్లకే ఛాంపియన్. భారత్‌కు గర్వకారణం. ప్రతీ ఒక్క భారతీయుడికి మీరే స్పూర్తి. ఒలింపిక్స్‌లో మీ అనర్హత మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. మీకు కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సవాళ్లను ఎదురొడ్డి పోరాడే స్వభావం మీది. మళ్లీ గెలుపు దిశగా ముందుకు సాగాలి‘ అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.వినేశ్ ఫోగట్ అనర్హత విషయంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత వార్త: వినేశ్ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ కీలక ఆదేశాలు -
ఏపీలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటన
-
AP: సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆరోగ్య మంత్రి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు. -
కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
కోవిడ్‌కి గురైనవారు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా గుండెపై ప్రభావం చూపిస్తుందా?. కరోనా వచ్చినవారంతా జాగ్రత్తగా ఉండాల్సిదేనా?. ఆరోగ్య మంత్రి సైతం కరోనా ఇన్ఫెక్షన్కి గురైన అలాంటివి చేయొద్దంటూ హెచ్చరించడంతో ఒక్కసారిగా మళ్లీ కరోనా గుబులు పోలేదా అని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈనేపథ్యంలోనే ఈ కథనం!. వివరాల్లోకెళ్తే..ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కరోనా బారిన పడినవారు గుండెపోటు రాకుండా ఉండాలంటే అతిగా శ్రమించటం, భారీగా వ్యాయమాలు వంటివి చేయటం మానుకోవాలని సూచించారు. ఇటీవల గుజరాత్ నవరాత్రి వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ సుమారు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. పైగా మృతుల్లో 13 ఏళ్ల బాలుడు అతి పిన్న వయస్కుడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలిచ్చారు. దీంతో ఒక్కసారి కరోనా భయాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అంతేగాదు మాండవియా ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం తీవ్ర కరోనాతో బాధపడినవారు గుండెపోటుకి గురికాకుడదంటే కనీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అతిగా వ్యాయామాలు, వంటి జోలికి పోకూడదని చెబుతోందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. #WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV — ANI (@ANI) October 30, 2023 కరోనా వల్ల గుండె సమస్యలు వస్తాయా..? కరోనా అనేది శ్వాసకోస లేదా ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినదే అయినప్పటికీ గుండెపై ప్రభావం చూపుతుంది. గుండె కణాజాలనికి సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మొదలవుతుంది సమస్య. ఈ వైరస్ ఊపిరితిత్తులలోని గాలి సంచులను ద్రవంతో నింపుతుంది. ఫలితంగా కొద్ది ఆక్సిజన్ మాత్రమే రక్తప్రవాహంలో ఉంటుంది. దీంతో శరీరంలోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల గుండె కణాజాలానికి శాశ్వత నష్టం లేదా తాత్కాలిక నష్టం ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాల కణజాలానికి సోకి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్లు సిరలు, ధమనులు అంతర్గత ఉపరితలాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తానాళాల్లో వాపు లేదా నష్టం ఏర్పడి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితం శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా జరగదు. శరీరం ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా.. వైరల్ ఇన్షెక్షన్లు కారణంగా శరీరం ఒత్తిడికి లోనై కాలోకోలమైన్లు అనే రసాయాలను విడుదల చేస్తుంది. ఇది గుండె పనితీరుకు ఆటంక కలిగించి గుండె సమస్యలు ఉత్ఫన్నమయ్యేలా చేస్తుంది. గుండె ఆరోగ్యం ఉండాలంటే.. వ్యాయామాలను అతిగా కాకుండా శరీరానికి తగినంతగా చేయాలి పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి తగినంత కంటి నిండా నిద్రపోవాలి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి ధుమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ విధమైన ఆరోగ్యకరమైన అలవాట్లు కరోనా వైరస్‌ను జయించేలా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె సమస్యలను రాకుండా నిరోధించడంలో సహాయ పడుతాయి. (చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!) -
చెరకు ధర క్వింటాల్‌కు రూ.315
న్యూఢిల్లీ: చెరకు పంటకు ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ను క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023–24 సీజన్లో సంవత్సరంలో క్వింటాల్ చెరకు ధర రూ.315కు పెరిగింది. చక్కెర మిల్లులు రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.315 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఎఫ్ఆర్పీని పెంచుతూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో క్వింటాల్ చెరుకు ఎఫ్ఆర్పీ రూ.305 ఉండగా, ఈసారి రూ.315 కానుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రైతన్నలకు మన ప్రధానమంత్రి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) సిఫార్సుల ఆధారంగా చెరుకు ఎఫ్ఆర్పీని ఖరారు చేస్తుంటారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. 2014–15 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాల్‌కు రూ.210 ఉండేది. 2013–14లో చక్కెర మిల్లులు రూ.57,104 కోట్ల విలువైన చెరకు పంటను కొనుగోలు చేశాయి. 2022–23లో రూ.1,11,366 కోట్ల విలువైన 3,353 లక్షల టన్నుల చెరకును సేకరించాయి. ఇండియాలో దాదాపు 5 కోట్ల మంది రైతులు చెరుకు సాగు చేస్తున్నారు. చక్కెర మిల్లుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు! దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఎన్ఆర్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం ముద్రవేసింది. ప్రధాని మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం వెల్లడించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు–2023ను త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ‘సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం–2008’ స్థానంలో ఈ బిల్లును తీసుకొన్నట్లు వివరించారు. 2027–28 దాకా పరిశోధనల కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.14,000 కోట్లను వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఖర్చు చేస్తుందన్నారు. మిగతా రూ.36,000 కోట్లను ప్రైవేట్ రంగ సంస్థలు, అంతర్జాతీయ పరిశోధక సంస్థల నుంచి సేకరిస్తామన్నారు. ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని, ఇందులో 15 నుంచి 25 మంది నిపుణులు, పరిశోధకులు సభ్యులుగా ఉంటారని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం పని చేస్తుందన్నారు. ‘పీఎం–ప్రణామ్’కు ఆమోదం ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘పీఎం–ప్రణామ్’ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.68 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.1,451 కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలో సల్ఫర్–కోటెడ్ యూరియా(యూరియా గోల్డ్)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా తోడ్పడుతుంది. నేల సారాన్ని కాపాడుకోవడమే ‘పీఎం–ప్రణామ్’ లక్ష్యమని కేంద్రం వెల్లడించింది. -
నూతన వైద్య కళాశాలల నిర్మాణానికి చేయూతనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఏపీలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయను కోరారు. ఆమె బుధవారం కేంద్రమంత్రిని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యశాఖకు సంబంధించి పలు విషయాలను చర్చించి వినతిపత్రాలు ఇచ్చారు. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్యకళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 16 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే వీటి నిర్మాణం ప్రారంభమైందన్నారు. వీటికి తగిన ఆర్థికసాయం అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీలో తీసుకొస్తున్న కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వ చేయూత తోడైతే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో త్వరలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో సహకరిస్తాం ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణానికి సాయం చేస్తామని చెప్పారు. 10 లక్షల జనాభా దాటిన ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని తెలిపారు. ఏపీలో రైల్వే, ఈఎస్ఐ ఆస్పత్రుల పరిధిలో వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర మంత్రి రజని మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌ల అధ్యయనానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రధాని నరేంద్రమోదీని ఏపీకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పారన్నారు. రాష్ట్రంలో వైద్యం, ఆరోగ్యం విషయంలో సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్న తీరును ఆయన ప్రశంసించారని తెలిపారు. రాష్ట్ర మంత్రి వెంట ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్ తదితరులున్నారు. -
మంకీపాక్స్ కొత్తదేం కాదు!: పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది మంకీపాక్స్ బాధితుల సంఖ్య. ఇందులో ఐదు కేరళ, రెండు కేసులు ఢిల్లీలో వెలుగు చూశాయి. చాలా ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలతో పరీక్షలకు శాంపిల్స్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవియా.. మంకీపాక్స్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్ కొత్త వైరస్ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. కరోనా టైంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి, మంకీపాక్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కేరళలో తొలి కేసు నమోదు అయినప్పుడే ఆరోగ్య శాఖ తరపున ఓ బృందాన్ని అక్కడికి పంపించాం. కేంద్రం తరపున స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా వైరస్‌ను అధ్యయనం చేస్తోంది. కేరళ ప్రభుత్వం ఆ ఫోర్స్‌కు అన్నివిధాల సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారాయన. అలాగే.. Monkeypox is not a new disease in India and in the world, since 1970 a lot of cases are being seen from Africa. WHO has paid special attention to this. Monitoring has started in India too: Union Health Minister Mansukh Mandaviya in Rajya Sabha pic.twitter.com/rv9uoW8KMH — ANI (@ANI) August 2, 2022 ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశాం. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1970 నుంచే ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది మరో 75 దేశాల్లో వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ మీద ప్రత్యేక దృష్టి సారించింది కూడా. వైరస్ బారిన పడ్డ వాళ్లకు ఐసోలేషన్ కోసం రెండు వారాల గడువు రికమండ్ చేసినట్లు పేర్కొన్న ఆయన.. వ్యాక్సిన్ తయారీ అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: అచ్చం చికెన్‌పాక్స్‌లాగే.. మంకీపాక్స్ కూడా! కాకపోతే.. -
‘ప్రభుత్వ ప్రికాషనరీ’ డోస్‌కు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: అర్హులందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలం గాణ వద్ద 32 లక్షల వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు కూడా సమీపిస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కరోనా కేసులు పెరుగుతున్నందున, రెండు డోసులు పూర్తిచేసుకొన్న అర్హులకు ప్రికాషనరీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యంలో ప్రస్తుతం 60 ఏళ్లు దాటినవారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని పేర్కొన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించిందని చెప్పారు. ప్రైవేటుతోపాటు ప్రభుత్వ కేంద్రాల్లోనూ 18–59 ఏళ్ల వయస్సన్నవారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతిస్తే ఫలితాలు గణనీయంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని, ఈ నెల 3న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పదిరోజుల్లో 1.30 లక్షలమందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు మరింత పెంచనున్నట్లు చెప్పారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్‌మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్షలో ఉన్నతాధికారులు రిజ్వీ, శ్వేతా మహంతి, గంగాధర్, శ్రీనివాస్‌రావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి డోసులకు పైగా వ్యాక్సినేషన్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్క రోజులోనే 1,00,64,032 డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్‌ను విజయవంతం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు. -
20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకి భయాందోళనలు కలిగిస్తున్నాయి. అవకాశం వస్తే.. ఆ దేశం దాటిపోవడానికి లక్షలాది మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిత్యం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా అఫ్గాన్ నుంచి తరలిస్తున్నాయి. తాజాగా అఫ్గాన్ నుంచి ఓ ప్రత్యేక విమానంలో 168 మంది భారత్ చేరుకున్నారు. అఫ్గానిస్తాన్ ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా కాబూల్ నుంచి భారత్‌కు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ..‘‘ నాకు ఏడుపు వస్తోంది. గత 20 ఏళ్లలో సాధించినదంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మిగిలింది సున్నా " అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. నిలువ నీడ లేదు..! అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబానికి సహాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. తాలిబన్లు మా ఇంటిని తగలబెట్టారు. మాకు నిలువ నీడ లేకుండా చేశారు. భారతీయ సోదరీసోదరులు రక్షణగా నిలిచారు. సహాయం చేసినందుకు నేను భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరింది. వీరిలో 107 మంది భారతీయులతో సహా 168 మందిని కాబూల్ నుంచి భారత్ తరలించింది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. " పోలియో వైరస్‌కు నివారణ చర్యగా అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన వారికి ఉచిత పోలియో వ్యాక్సిన్ - ఓపీవీ& ఎఫ్‌ఐపీవీ టీకాలు వేయాలని నిర్ణయించాం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశాం.’’ అని తెలిపారు. #WATCH | Afghanistan's MP Narender Singh Khalsa breaks down as he reaches India from Kabul. "I feel like crying...Everything that was built in the last 20 years is now finished. It's zero now," he says. pic.twitter.com/R4Cti5MCMv — ANI (@ANI) August 22, 2021 We have decided to vaccinate Afghanistan returnees with free Polio Vaccine - OPV & fIPV, as a preventive measure against Wild Polio Virus Congratulations to the Health Team for their efforts to ensure public health Take a look at the vaccine drive at Delhi International Airport pic.twitter.com/jPVF1lVmRu — Mansukh Mandaviya (@mansukhmandviya) August 22, 2021 చదవండి: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్ మస్క్: వైరల్ -
20,000 కోట్లతో అమరావతి ఓఆర్ఆర్
కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)ను రూ.20,000 కోట్లతో చేపడుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, ఎరువులు, రసాయనాలు, షిప్పింగ్ శాఖల సహాయ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు. అమరావతి ఓఆర్ఆర్కు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ఆయన శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. డీసీఐఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులకు సంబంధించి 66 పనులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న విజయనగరం బైపాస్ నాలుగు లేన్ల విస్తరణకు రూ.430 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్‌లోని రహదారి అభివృద్ధికి రూ.60 కోట్లు కేటాయించామన్నారు.