కోవిడ్‌కి గురైనవారు చాలామంది గుండె సంబంధిత సమస్యల బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా గుండెపై ప్రభావం చూపిస్తుందా?. కరోనా వచ్చినవారంతా జాగ్రత్తగా ఉండాల్సిదేనా?. ఆరోగ్య మంత్రి సైతం కరోనా ఇన్ఫెక్షన్‌కి గురైన అలాంటివి చేయొద్దంటూ హెచ్చరించడంతో ఒక్కసారిగా మళ్లీ కరోనా గుబులు పోలేదా అని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈనేపథ్యంలోనే ఈ కథనం!.
వివరాల్లోకెళ్తే..ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కరోనా బారిన పడినవారు గుండెపోటు రాకుండా ఉండాలంటే అతిగా శ్రమించటం, భారీగా వ్యాయమాలు వంటివి చేయటం మానుకోవాలని సూచించారు. ఇటీవల గుజరాత్ నవరాత్రి వేడుకల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ సుమారు 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. పైగా మృతుల్లో 13 ఏళ్ల బాలుడు అతి పిన్న వయస్కుడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యమంత్రి ఈ విధంగా ప్రజలకు సూచనలిచ్చారు. దీంతో ఒక్కసారి కరోనా భయాలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అంతేగాదు మాండవియా ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం తీవ్ర కరోనాతో బాధపడినవారు గుండెపోటుకి గురికాకుడదంటే కనీసం ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు అతిగా వ్యాయామాలు, వంటి జోలికి పోకూడదని చెబుతోందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
#WATCH | Bhavnagar, Gujarat: On heart attack cases during the Garba festival, Union Health Minister Mansukh Mandaviya says, "ICMR has done a detailed study recently. The study says that those who have had severe covid and enough amount of time has not passed, should avoid… pic.twitter.com/qswGbAHevV
— ANI (@ANI) October 30, 2023
కరోనా వల్ల గుండె సమస్యలు వస్తాయా..?
కరోనా అనేది శ్వాసకోస లేదా ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించినదే అయినప్పటికీ గుండెపై ప్రభావం చూపుతుంది. గుండె కణాజాలనికి సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మొదలవుతుంది సమస్య. ఈ వైరస్ ఊపిరితిత్తులలోని గాలి సంచులను ద్రవంతో నింపుతుంది. ఫలితంగా కొద్ది ఆక్సిజన్ మాత్రమే రక్తప్రవాహంలో ఉంటుంది. దీంతో శరీరంలోకి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల గుండె కణాజాలానికి శాశ్వత నష్టం లేదా తాత్కాలిక నష్టం ఏర్పడుతుంది.
కొన్ని కేసుల్లో కరోనా వైరస్ నేరుగా గుండె కండరాల కణజాలానికి సోకి దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్‌లు సిరలు, ధమనులు అంతర్గత ఉపరితలాలను కూడా ప్రభావితం చేస్తాయి. దీంతో రక్తానాళాల్లో వాపు లేదా నష్టం ఏర్పడి రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితం శరీరంలో ఇతర భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా జరగదు.
శరీరం ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా..
వైరల్ ఇన్షెక్షన్‌లు కారణంగా శరీరం ఒత్తిడికి లోనై కాలోకోలమైన్‌లు అనే రసాయాలను విడుదల చేస్తుంది. ఇది గుండె పనితీరుకు ఆటంక కలిగించి గుండె సమస్యలు ఉత్ఫన్నమయ్యేలా చేస్తుంది.
గుండె ఆరోగ్యం ఉండాలంటే..
- వ్యాయామాలను అతిగా కాకుండా శరీరానికి తగినంతగా చేయాలి
- పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి
- తగినంత కంటి నిండా నిద్రపోవాలి
- ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి
- ధుమపానం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి
ఈ విధమైన ఆరోగ్యకరమైన అలవాట్లు కరోనా వైరస్‌ను జయించేలా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో గుండె సమస్యలను రాకుండా నిరోధించడంలో సహాయ పడుతాయి.
(చదవండి: ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!)
Comments
Please login to add a commentAdd a comment