కూలిన పురాతన బ్రిడ్జి
Published Sat, Sep 9 2017 12:28 PM | Last Updated on Tue, Sep 12 2017 2:22 AM
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామ శివారులో ఓ పురాతన బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులతో పాటు రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సాయిలు, సాయి అనే ఇద్దరు వ్యక్తులు పశువులను తోలుకుంటూ బ్రిడ్జి పై నుంచి వెళ్తున్నసమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది.. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement