
బెంగళూరు: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచి్చందని, త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచి్చంది. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదు. ఈయనది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అతిత్వరలో కుప్పకూలుతుంది’అని పేర్కొన్నారు.
‘దేశ క్షేమం కోసం ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తాం. కానీ, మన ప్రధానికి సవ్యంగా కొనసాగే ఏ పనికైనా అవాంతరం కల్పించడం అలవాటు. అయినప్పటికీ దేశం కోసం మేం సహకారం అందిస్తూనే ఉంటాం’అని ఖర్గే అన్నారు.
భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), హిందుస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ సారథ్యంలో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పీవీ నరసింహారావు రాజకీయ చతురతతో రెండేళ్లలోనే మెజారిటీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవలి ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటున కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పోషించాలని రిపబ్లికన్ పార్టీ, హెచ్‌ఏఎంలు ఖర్గేకు సలహా ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment