వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో శుక్రవారం మధ్యాహ్నం ఒక హోటల్ కుప్పకూలింది. స్థానిక సెవెన్‌రోడ్స్ కూడలిలో ఉన్న సుజాత హోటల్ భవనం ఒక్కసారిగా కూలిపోవటంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.