మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు.
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు. తుమ్మిడికుంట చెరువును ఆనుకుని ఉన్న ఈ భారీ ఫంక్షన్ హాలు చెరువుకు సంబంధించి 25 మీటర్ల మేర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చారు.
వాస్తవానికి చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్తో పాటు, బఫర్ జోన్గా మరో 30 మీటర్లు కూడా ఉండాల్సి ఉంది. అయితే, చెరువు గట్టునే ఉన్న ఈ సెంటర్ హాలులో 25 మీటర్లు ఫుల్ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.