full tank level
-
అక్కడ కొంటే కాస్త జాగ్రత్త
యథేచ్ఛగా 111 జీవోలో వెంచర్లు, ప్రాజెక్ట్‌లు {పగతి ఇక్కడేనంటూ నిలువెల్లా ముంచేస్తున్న బిల్డర్లు అసలు నిర్మాణాలే చేపట్టరాదంటున్న జీవో ఎన్నారై అయిన శ్రీధర్.. భాగ్యనగరంలో స్థిరాస్తి కొనుగోలుకు ముందడుగేశాడు. విమానాశ్రయం ఉందనో.. ఔటర్‌కు దగ్గరుందనో.. మెట్రో రానుందనో.. చెప్పి.. ఫ్లాటో/ప్లాటో కొనకపోతే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్టేనని బిల్డర్లు, రియల్టర్లు నమ్మించారు. దీంతో తొందరపడి స్థిరాస్తిని కొనుగోలు చేశాడతను. తీరా చూస్తే.. తాను కొన్న స్థిరాస్తి బయో కన్జర్వేషన్ జోన్ కిందికొస్తుందని.. అసలక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టరాదని తెలిసింది. దీంతో ఎటూ పాలుపోలేదు శ్రీధర్‌కు.. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి సంఘటనలు నగరంలో చాలా మందికి అనుభవమే. ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా అలాంటి సంఘటనలు ఎవరికైనా పునరావృతమవుతాయనేది నిపుణుల సూచన. ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక పారిశ్రామిక విధానం, త్వరలో తెరమీదికి రానున్న హౌసింగ్ పాలసీ వంటి వాటితో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయి. దీంతో మళ్లీ భాగ్యనగరంలో స్థిరాస్తికి మంచి రోజులు రానున్నాయి. ఇలాంటి సమయంలోనే రియల్టర్లు అందమైన మాటలతో, కలలోని అభివృద్ధిని అరచేతిలో చూపిస్తూ అక్రమ నిర్మాణాలను కొనుగోలుదారులకు అంటగడతారు. ఇలాంటి పరిస్థితుల్లో 111 జీవో పరిధిలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను కాపాడేందుకు, నీటి పరివాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 2006 మార్చిలో ప్రభుత్వం జీవో నంబర్ 111ను విడుదల చేసింది. జీవో పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే-అవుట్లు వేయకూడదని స్పష్టం చేసింది కూడా. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 90 శాతం భూమిని బయో కన్జర్వేషన్ జోన్ కిందికి తీసుకొచ్చారు. మిగిలిన 10 శాతంలో నిర్మాణాలుంటాయి. రెండు చెరువుల్లోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) 10 కి.మీ. చుట్టూ కాలుష్య పరిశ్రమలు, హోటళ్లు, నివాస, వాణిజ్య సముదాయాల వంటి నిర్మాణాలను అనుమతించరు. 84 గ్రామాల్లోని 90 శాతం భూమి రిక్రియేషనల్, కన్వర్జేషన్ కింద ఉంటుంది. మిగిలిన 10 శాతం స్థలంలో గ్రౌండ్+2 అంతస్తుల వరకే అనుమతిస్తారు. ఉల్లంఘనలు జరుగుతున్నదిక్కడే.. జీవో పరిధిలో 10 శాతంలో నిర్మాణాలను అనుమతిస్తారు అంటే దానర్థం.. మాస్టర్ ప్లాన్ ప్రకారం జీవో పరిధిలోని మొత్తం స్థలంలో 10 శాతం భూమన్నమాట. ఇప్పటికే ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ పట్టణం, 84 గ్రామ కంఠాలు, ఇతర అభివృద్ధి పనులకు స్థలాన్ని కేటాయించారు. అంటే 10 శాతం స్థలం పూర్తయింది. కానీ, రియల్టర్లు ఏం చేస్తున్నారంటే.. 111 జీవో పరిధిలోని ప్రతి లే-అవుట్లో 10 శాతం స్థలాన్ని నివాస సముదాయాలకు కేటాయించొచ్చంటూ బుకాయిస్తున్నారు. ‘ప్రగతి’ ఇక్కడే అంటూ.. దశాబ్దకాలంగా 111 జీవో పరిధిలో సుమారు 5,000కు పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయని అంచనా. నిర్మాణాలే కాదు.. ఇక్కడ లెక్కలేనన్ని ఇంజనీరింగ్ కళాశాలలు, రెండు మెడికల్ కాలేజీలూ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. ఇదిలా ఉంటే అంతరించిపోతున్న ఔషద మొక్కలు పెంచుతున్నాన ంటూ వేల ఎకరాల్లో రిసార్ట్‌ను నిర్మించి.. వాటి మధ్యలో రియల్టీ వ్యాపారం చేస్తున్నారు కొందరు రియల్టర్లు. పచ్చని ప్రకృతి మధ్యలో ఆహ్లాదకరంగా జీవించొచ్చని చెబుతూ కొనుగోలుదారులను నిలువునా ముంచుతున్నాయీ సంస్థలు. ఇవే కాదు. 111 జీవో పరివాహక ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఫామ్ హౌస్‌లు, రిసార్టులు వెలిశాయి. ఈ అక్రమ నిర్మాణాలను కొనుగోలు చే సిన వారిలో సామాన్యులే కాదు ఉన్నతోద్యోగులు, ప్రవాసాలూ ఉండటం గమనార్హం. ఇక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించడానికీ అనుమతి లేదు. ఎఫ్ఎస్ఐ (బిల్టప్ స్పేస్ ఏరియా), పరివాహక ప్రాంతం (క్యాచ్మెంట్ ఏరియా) 1:0.5 నిష్పత్తిలో ఉండాలి కూడా. కానీ ఇక్కడ చాలా నిర్మాణాలు జీ+3 అంతస్తులను దాటిపోతున్నాయి. ఎప్పుడో ఒకనాడు ప్రభుత్వం కనక కొరఢా ఝుళిపిస్తే ఈ రియల్టర్ల దగ్గర కొనుగోళ్లు చేసిన సామాన్యులు రోడ్డున పడతారన్నది నిపుణుల మాట. ఇవి చూడాల్సిందే.. ‘బఫర్’ అంటే భయమే.. బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనొద్దు కూడా. ఎఫ్టీఎల్ అంటే జేబు నిల్లే.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది. -
చెరువులు
ఆక్రమణదారుల గుప్పిట్లో చెరువులు, కుంటలు వేలాది ఎకరాల శిఖం భూములు అన్యాక్రాంతం రూ.కోట్ల విలువైన సంపద అక్రమార్కుల పరం నేడు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు రాక ప్రతి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో నిర్మాణాలకు అనుమతించొద్దు.. నిర్మిస్తే కూల్చి వేయూలి.. అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. వీటిని అమలు చేయూలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. వరంగల్ రూరల్ :జిల్లాలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నారుు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లారుు. పల్లెలు, పట్టణాలు, నగరాలు విస్తరించడం.. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో స్థలాల విలువ పెరగడం.. నివాస స్థలాలు దొరక్కపోవడంతో రియల్టర్లు, రాజకీయ నాయకుల దృష్టి చెరువులపై పడింది. రెవెన్యూ అధికారుల అండదండలతో కాకతీయుల కాలం నాటి చెరువులు కనుమరుగవుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కారు సాగు, తాగు నీటి అవసరాల కోసం చిన్న చెరువుల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది. ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రతి చెరువును పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేస్తోంది. జిల్లాలో అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి? అందులో అక్రమణలకు గురైనవి ఎన్ని? అనే విషయాలపై సర్వే నిర్వహించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అక్రమణలకు గురైన వాటిని గుర్తించారు. జిల్లాలో 5,865 చెరువులు ఉండగా.. 63 చెరువులు అక్రమణలకు గురైనట్లు లెక్క తేల్చారు. గ్రేటర్ పరిధిలో చెరువులన్నీ అన్యాక్రాంతం గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు ఉన్న ప్రాంతాల్లో కాలనీలు వెలియడంతో చెరువుల అనవాళ్లు లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా 63 చెరువులు అక్రమణలకు గురి కాగా.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు అక్రమణలకు గురయ్యాయి. హన్మకొండ మండల పరిధిలో న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల, బంధం, భట్టుపల్లి కోట, తిమ్మాపూర్ బెస్తం, మడికొండ లోయ కుంట, అయోధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు, పురి గిద్దు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఏనుమాములలోని సాయి, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పుల లోని పెద్ద చెరువు, ఉంగల, మాలకుంటలు ఉన్నాయి. వరంగల్ మండల పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, భీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది.... అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయిందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చె ప్పలేక పోతున్నారు. ట్రైసిటీస్తోపాటు కాజీపేట రెవెన్యూ గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యూరుు. ఆక్రమణల్లో మరో 29 చెరువులు సాగు నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించిన సర్వేల్లో 63 చెరువులు అక్రమణలకు గురికాగా.. అందులో 34 నగర శివారు పరిధిల్లో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో 29 చెరువులు అక్రమణలకు గురైనట్లు అధికారులు లెక్కల్లో పేర్కొన్నారు. చేర్యాల మండలంలో కుడి చెరువు, పెద్ద చెరువు, కొండ పోచమ్మ చెరువు, బచ్చన్నపేటలో గోనే చెరువు, నర్సింహులపేటలో పేకలచెరువు, కురవీలో బంధం చెరువు, దత్తరాల చెరువు, మామిడాల చెరు వు, ఊర చెరువు, నర్సంపేటలో పెద్ద చెరువు, దామె ర చెరువు, ఖానాపూర్‌లో పాకాల చెరువు, చిట్యాలలో ఊర చెరువు, పెద్ద చెరువు, టేకుమట్ల ఊర చెరువు, భూపాలపల్లిలో తిప్పిరెడ్డికుంట, పోల్కమ్మ చెరువు, దోమలపల్లి చెరువు, పెద్దదామెర చెరువు, శాయంపేట గట్లకానిపర్లిలో పెద్ద చెరువు, రేగొం డలో దామెర చెరువు, యాసిన్ చెరువు, వెంకటాద్రికుంట, చౌకుంట, ఆత్మకూరు ఓగ్లాపూర్‌లోని ఊర చెరువు, మహబూబాబాద్‌లో బంధం చెరువు, జానాల చెరువు, గుండ్ల కుంట, కృష్ణసాయి కుంటలు ఉన్నాయి. చేర్యాల, మహబూబాబాద్, నర్సంపేటల్లోని చెరువులు నివాస గృహాల కోసం ప్లాటింగ్ చేయగా మిగిలిన మండలాల్లోని చెరువు వ్యవసాయం నిమిత్తం ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైన వివరాలు లేకపోవడం వల్ల ఈ సర్వే మొక్కుబడిగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సమగ్ర సర్వేను నిర్వహిస్తే అన్యాక్రాంతం అయిన చెరువుల వివరాలు వెలుగుచూస్తాయి. కబ్జాకు గురైన చెరువుల భూములు.. వరంగల్ దేశాయిపేట రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబర్ 300లోని చిన్న వడ్డేపల్లి విస్తీర్ణం 100 ఎకరాలు.. కాగా ఎఫ్టీఎల్ పరిధి 130 ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. ఇందులో 18 ఎకరాలు అక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. జెసీ కరుణ ఉన్న సమయంలో అక్రమణ నిర్మాణాలు కూల్చేందుకు ఉపక్రమించగా అధికారంలో ఉన్న నేతలు అడ్డుకున్నారు. దీంతో మళ్లీ తాజాగా అక్రమించుకునేందుకు రియల్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు. మట్టెవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 352లో ఉన్న కోట చెరువు 158 ఎకరాలని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 30 ఎకరాలు కబ్జాలకు గురైంది. రంగశాయిపేట సర్వే నంబర్ 179లోని దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు ఉండగా.. అందు లో 10 ఎకరాలు, సర్వే నంబర్ 64లోని బెస్తం చెరువు 6.17ఎకరాలు ఉండగా.. 4 ఎకరాలు అన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 304లోని ఉర్సు రంగసముద్రం 132 ఎకరాల్లో 18 ఎకరాలు అక్రమించుకున్నట్లు సమాచారం. నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువు సుమారు 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఈ చెరువును స్టోరేజీ ట్యాంకుగా మార్చారు. స్టోరేజీ ట్యాంకుగా మారిన చెరువులోకి వర్షపు నీరు రాకుండా చుట్టూ బండ్ ఏర్పాటు చేయడంతో ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ విషయంపై ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ సైతం జరిపారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైందన్న వివరాలు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
‘లేక్’లో కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రతి రోజూ ఎక్కడో అక్కడ అక్రమ నిర్మాణం అనో.. బఫర్ జోన్‌లోనో.. ఎఫ్టీఎల్లోనో అపార్ట్మెంట్ కట్టారనో వింటుంటాం. తక్కువ ధరకు వస్తుందనో లేక లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నారనో తొందరపడి ముందూ వెనకా ఆలోచించకుండా ఫ్లాట్ కొన్నారో ఇక అంతే సంగతులు. అసలు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా? లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవడం తప్పదంటున్నారు నిపుణులు. ‘బఫర్’ అంటే భయమే.. బఫర్ జోన్ అంటే నీటి పరివాహక ప్రాంతం. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు పారుతుంటుంది. దీన్ని అలుగు అంటారు. ఇక్కడి నుంచి పొలాలకు నీరు మళ్లుతుంటుంది. ఈ మధ్య ఉన్న ప్రాంతాన్నే అంటే చెరువుకు, పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారన్నమాట. ఉస్మాన్‌సాగర్ కింద ఉన్న భూములన్నీ బఫర్‌జోన్ కిందికే వస్తాయి. ఈ కింద ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించకూడదు. కొనకూడదు కూడా. ఎఫ్టీఎల్ అంటే జేబు నిల్లే.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) అంటే చెరువు కట్ట ప్రాంతం. ఈ ప్రాంతం నీటి పారుదల శాఖ విభాగం కిందికొస్తుంది. చెరువు కట్ట ప్రాంతాన్ని ఆనుకొని నగరంలో బడా నిర్మాణాలు వెలుస్తున్నాయి. అయితే వీటిలో ఫ్లాట్ కొనేముందు కొనుగోలుదారులు కొన్ని కీలక పత్రాలు చూడాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ప్రాంతంలోని నిర్మాణాలకు నీటి పారుదల శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. అలాగే సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ), జీహెచ్ఎంసీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పసరండోయ్. ఈ మూడు పత్రాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సంబంధిత స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికుంది. ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు కోర్టుకెళ్లినా లాభముండదు. -
ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు. తుమ్మిడికుంట చెరువును ఆనుకుని ఉన్న ఈ భారీ ఫంక్షన్ హాలు చెరువుకు సంబంధించి 25 మీటర్ల మేర ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తేల్చారు. వాస్తవానికి చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్‌తో పాటు, బఫర్ జోన్‌గా మరో 30 మీటర్లు కూడా ఉండాల్సి ఉంది. అయితే, చెరువు గట్టునే ఉన్న ఈ సెంటర్ హాలులో 25 మీటర్లు ఫుల్ట్యాంక్ లెవెల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.