చెరువులు | the invaders, ponds, ditches | Sakshi
Sakshi News home page

చెరువులు

Published Tue, Dec 9 2014 1:45 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

చెరువులు - Sakshi

చెరువులు

ఆక్రమణదారుల గుప్పిట్లో చెరువులు, కుంటలు
వేలాది ఎకరాల శిఖం భూములు అన్యాక్రాంతం
రూ.కోట్ల విలువైన సంపద అక్రమార్కుల పరం
నేడు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు  రాక

 
ప్రతి చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో  నిర్మాణాలకు అనుమతించొద్దు.. నిర్మిస్తే కూల్చి వేయూలి..    అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. వీటిని అమలు చేయూలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది.
 
వరంగల్ రూరల్ :జిల్లాలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నారుు. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమార్కుల గుప్పిట్లోకి వెళ్లారుు. పల్లెలు, పట్టణాలు, నగరాలు విస్తరించడం.. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో స్థలాల విలువ  పెరగడం.. నివాస స్థలాలు దొరక్కపోవడంతో రియల్టర్లు, రాజకీయ నాయకుల దృష్టి చెరువులపై పడింది. రెవెన్యూ అధికారుల అండదండలతో కాకతీయుల కాలం నాటి చెరువులు కనుమరుగవుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కారు సాగు, తాగు నీటి అవసరాల కోసం చిన్న చెరువుల పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది. ‘మిషన్ కాకతీయ’ పేరిట ప్రతి చెరువును పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేస్తోంది. జిల్లాలో అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి? అందులో అక్రమణలకు గురైనవి ఎన్ని? అనే విషయాలపై సర్వే నిర్వహించాలని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు అక్రమణలకు గురైన వాటిని గుర్తించారు. జిల్లాలో 5,865 చెరువులు ఉండగా.. 63 చెరువులు అక్రమణలకు గురైనట్లు లెక్క తేల్చారు.

గ్రేటర్ పరిధిలో చెరువులన్నీ అన్యాక్రాంతం

గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు ఉన్న ప్రాంతాల్లో కాలనీలు వెలియడంతో చెరువుల అనవాళ్లు లేకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా 63 చెరువులు అక్రమణలకు గురి కాగా.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు అక్రమణలకు గురయ్యాయి.

హన్మకొండ మండల పరిధిలో న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల, బంధం, భట్టుపల్లి కోట, తిమ్మాపూర్ బెస్తం, మడికొండ లోయ కుంట, అయోధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు,

పురి గిద్దు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఏనుమాములలోని సాయి, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పుల లోని పెద్ద చెరువు, ఉంగల, మాలకుంటలు ఉన్నాయి.

వరంగల్ మండల పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, భీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది.... అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతం అయిందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చె ప్పలేక పోతున్నారు. ట్రైసిటీస్‌తోపాటు కాజీపేట రెవెన్యూ గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యూరుు.
 
ఆక్రమణల్లో మరో 29 చెరువులు

సాగు నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించిన సర్వేల్లో 63 చెరువులు అక్రమణలకు గురికాగా.. అందులో 34 నగర శివారు పరిధిల్లో ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో 29 చెరువులు అక్రమణలకు గురైనట్లు అధికారులు లెక్కల్లో పేర్కొన్నారు. చేర్యాల మండలంలో కుడి చెరువు, పెద్ద చెరువు, కొండ పోచమ్మ చెరువు, బచ్చన్నపేటలో గోనే చెరువు, నర్సింహులపేటలో పేకలచెరువు, కురవీలో బంధం చెరువు, దత్తరాల చెరువు, మామిడాల చెరు వు, ఊర చెరువు, నర్సంపేటలో పెద్ద చెరువు, దామె ర చెరువు,
ఖానాపూర్‌లో పాకాల చెరువు, చిట్యాలలో ఊర చెరువు, పెద్ద చెరువు, టేకుమట్ల ఊర చెరువు, భూపాలపల్లిలో తిప్పిరెడ్డికుంట, పోల్కమ్మ చెరువు, దోమలపల్లి చెరువు, పెద్దదామెర చెరువు, శాయంపేట గట్లకానిపర్లిలో పెద్ద చెరువు, రేగొం డలో దామెర చెరువు, యాసిన్ చెరువు, వెంకటాద్రికుంట, చౌకుంట, ఆత్మకూరు ఓగ్లాపూర్‌లోని ఊర చెరువు, మహబూబాబాద్‌లో బంధం చెరువు, జానాల చెరువు, గుండ్ల కుంట, కృష్ణసాయి కుంటలు ఉన్నాయి. చేర్యాల, మహబూబాబాద్, నర్సంపేటల్లోని చెరువులు నివాస గృహాల కోసం ప్లాటింగ్ చేయగా మిగిలిన మండలాల్లోని చెరువు వ్యవసాయం నిమిత్తం ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైన వివరాలు లేకపోవడం వల్ల ఈ సర్వే మొక్కుబడిగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సమగ్ర సర్వేను నిర్వహిస్తే అన్యాక్రాంతం అయిన  చెరువుల వివరాలు వెలుగుచూస్తాయి.

 కబ్జాకు గురైన చెరువుల భూములు..

వరంగల్ దేశాయిపేట రెవెన్యూ గ్రామ పరిధి సర్వే నంబర్ 300లోని చిన్న వడ్డేపల్లి విస్తీర్ణం 100 ఎకరాలు.. కాగా ఎఫ్టీఎల్ పరిధి 130 ఎకరాలుగా అధికారులు నిర్ధారించారు. ఇందులో 18 ఎకరాలు అక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. జెసీ కరుణ ఉన్న సమయంలో అక్రమణ నిర్మాణాలు కూల్చేందుకు ఉపక్రమించగా అధికారంలో ఉన్న నేతలు అడ్డుకున్నారు. దీంతో మళ్లీ తాజాగా అక్రమించుకునేందుకు రియల్టర్లు వ్యూహాలు రచిస్తున్నారు.
     
మట్టెవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 352లో ఉన్న కోట చెరువు 158 ఎకరాలని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 30 ఎకరాలు కబ్జాలకు గురైంది.
     
రంగశాయిపేట సర్వే నంబర్ 179లోని దామెర చెరువు విస్తీర్ణం 134 ఎకరాలు ఉండగా.. అందు లో 10 ఎకరాలు, సర్వే నంబర్ 64లోని బెస్తం చెరువు 6.17ఎకరాలు ఉండగా.. 4 ఎకరాలు అన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 304లోని ఉర్సు రంగసముద్రం 132 ఎకరాల్లో 18 ఎకరాలు అక్రమించుకున్నట్లు సమాచారం.
     
నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువు సుమారు 700 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజల నీటి అవసరాల కోసం ఈ చెరువును స్టోరేజీ ట్యాంకుగా మార్చారు. స్టోరేజీ ట్యాంకుగా మారిన చెరువులోకి వర్షపు నీరు రాకుండా చుట్టూ బండ్ ఏర్పాటు చేయడంతో ఫుల్ ట్యాంక్ లెవల్  పరిధిలోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ విషయంపై ఇటీవల విజిలెన్స్ అధికారులు విచారణ సైతం జరిపారు. ఎన్ని ఎకరాలు అక్రమణలకు గురైందన్న వివరాలు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement