టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తాజాగా నటిస్తోన్న చిత్రం 'కస్టడీ'. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో చైతూ పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటున్నారు చైతూ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్యకు పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానలిచ్చారు.
(ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!)
అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు నాగ చైతన్య. గతంలో పొన్నియిన్ సెల్వన్ నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య-సమంత అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రమోషన్లలో భాగంగా యూట్యూబర్ ఇర్ఫాన్‌తో డేర్ అండ్ ట్రూత్ అనే సరదా సెగ్మెంట్‌లో చైతూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మీరు ఎంత మందిని ముద్దులు పెట్టుకున్నారు అని నాగచైతన్యను ప్రశ్నించాడు. దానికి చైతన్య సిగ్గుపడుతూ.. 'నాకు తెలియదు. ఆ లెక్క మర్చిపోయా. సాధారణంగా సినిమాల్లోనే చాలా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. వాటన్నింటినీ నేను ఎలా గుర్తు పెట్టుకోగలను? అయినా ఇదంతా పబ్లిక్‌కు తెలిసిందే కదా. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. అయినా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను ఇబ్బందుల్లో పడతానేమో' అంటూ నవ్వుతూ అన్నారు.
(ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!)
కాగా.. కస్టడీ చిత్రంతోనే ద్వారానే చైతూ మొదటిసారిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment