
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. అతని కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.