
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు సుభాస్ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఇటీవలే సుశీల్ కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు తేలింది.
చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment