delhi crime police
-
రెజ్లర్ హత్య కేసు: సుశీల్ కుమార్ జూడోకోచ్ అరెస్ట్
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు సుభాస్ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్ కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు తేలింది. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
తీహార్ జైలుకు దినకరన్....
చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్‌ను జ్యుడీషియల్ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు సోమవారం సాయంత్రం తీహార్ జైలుకు తరలించారు. అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో మూడు రోజల పాటుగా విచారణ కొనసాగించిన ఢిల్లీ క్రైమ్ పోలీసులు.... ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో దినకరన్‌ను ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. అతడితో పాటుగా స్నేహితుడు మల్లికార్జున్‌ను పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడికి న్యాయమూర్తి పూనం చౌదరి ఆదేశించారు. అయితే బెయిల్ కోసం దినకరన్ తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కాగా దినకరన్ ఆరోగ్య విషయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదుల విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. ఢిల్లీలోని ఆసుపత్రిలో దినకరన్, మల్లికార్జున్‌లకు జరిగిన వైద్య పరిశోధనల అనంతరం గట్టి భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు దినకరన్‌కు చెందిన అయిదు బ్యాంక్‌ల్లోని ఖాతాల్ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దినకరన్ రూ. 50 కోట్లు ఇసుక కాంట్రాక్టుల ద్వారా సమీకరించి పనిలో పడ్డట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల 25న దినకరన్‌ను అరెస్ట్ చేశారు. -
రాజాజీ భవన్ వద్ద పోలీసుల హడావుడి
చెన్నై: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు రెండో రోజు కూడా చెన్నైలో విచారణ నిర్వహించారు. చెన్నైలోని మూడు ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం చెన్నైకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు అడయార్‌లోని నివాసంలో ఆయన వద్ద విచారణ సాగింది. ఇదే కేసులో అరెస్టు అయిన దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. శుక్రవారం ఈ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్ లేదా, కేరళకు తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, రాజాజీభవన్లోని సీబీఐ కార్యాలయానికి ఆ ఇద్దర్నీ పరిమితం చేశారు. ఓ బృందం వీరి వద్ద విచారణ సాగించగా, మరో బృందం ఆదంబాక్కం వల్లలార్ వీధిలోని రిటైర్డ్ అధికారి మోహనరంగన్ ఇంటి వద్ద గంట పాటు విచారణ సాగింది. అలాగే పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని ఆ ఇద్దరిని విచారణ చేపట్టారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హవాల ఏజెంట్ నరేష్‌ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.