సాక్షి, విశాఖపట్నం: పసిపిల్లల అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను కస్టడీ శుక్రవారంతో ముగిసింది. డాక్టర్ నమ్రతను విచారించడానికి మహారాణీ పేట పోలీసులు మూడు రోజుల గడువు కావాలని కోర్టును కోరగా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజుతో డాక్టర్ నమ్రత రెండు రోజుల కస్టడీ ముగిసింది. ఈ రోజు విచారణలో నమ్రత తమకు సహకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: చిన్నారుల అక్రమ రవాణా..రెండు రోజులే కస్టడీకి అనుమతి)
దాదాపు 7 గంటల పాటు విచారించినట్లు పోలీసులు తెలిపారు. అయితే చిన్నారుల అక్రమ రవాణాలో పలువురి పాత్రపై కూడా డాక్టర్ నమ్రతను ప్రశ్నించామని.. ఈ కేసులో ఆమె ప్రధాన ముద్దాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల విచారణలో డాక్యుమెంట్ల ఆధారంగా ఆమెను ప్రశ్నించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ నమ్రతను విశాఖ సెంట్రల్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అనారోగ్యంగా ఉందంటూ జైలులో హంగామా..
Comments
Please login to add a commentAdd a comment