
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.
తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్‌లో ఆమె ప్రస్తావించింది.
హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్‌లో వెల్లడించారు.
1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment