న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు షానవాజ్ హుస్సే న్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఒక మహిళ హుస్సేన్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటివరకు కనీసం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయకపోవడం వారిలో ఎంత అయిష్ట త ఉందో బహిర్గతమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ వ్యాఖ్యానించారు.
గతంలో ట్రయల్ కోర్టు ఎఫ్‌ఐఆర్ ఆదేశాలు జారీ చేయ మంటూ తీర్పునివ్వడం సరైన చర్యేనని పేర్కొ న్నారు. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ షానవాజ్ హుస్సేన్ సుప్రీంకోర్టుకెక్కారు. సుప్రీంలోనూ ఆయనకు చుక్కెదురైంది.
Comments
Please login to add a commentAdd a comment