![WhatsApp tells HC privacy policy on hold till Data Protection Bill comes - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/10/whatsaap.jpg.webp?itok=h-oOZtkH)
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చేంతవరకు తాము ప్రైవసీ విధానాన్ని నిలిపివేయడానికి అంగీకరించినట్టుగా వెల్లడించింది. కొత్త గోప్యతా విధానాలను అంగీకరించాలని తాము వినియోగదారులపై ఒత్తిడి తీసుకురామని ఢిల్లీ హైకోర్టు ఎదుట స్పష్టం చేసింది.
వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ‘‘మా ప్రైవసీ పాలసీ విధానాన్ని నిలిపివేయడానికి మేము అంగీకరించాం. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ ఇక వినియోగదారులకు కనిపించవు. ఆ విధానాలను అంగీకరించాలని ఒత్తిడి తీసుకురాము’’ అని స్పష్టం చేశారు. డేటా పరిరక్షణ బిల్లు చట్టం రూపం దాల్చేవరకు పాత విధానానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment