privacy policy
-
వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే?
యాప్‌లను వాడాలంటే ప్రైవసీ ఎంతో కీలకం. యూజర్ల సమాచారానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాప్ నిర్వాహకులపై ఉంటుంది. గతంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరిగింది. వ్యక్తిగత సమాచార గోప్యతకు భరోసా ఇస్తామని కేంద్రానికి వాట్సాప్ స్పష్టం చేసింది. అందులో భాగంగానే యూజర్ల ప్రైవసీకి వాట్సాప్ మేజర్ అప్డేట్తో ముందుకొచ్చింది. చాట్స్ కోసం వాట్సాప్ న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో ఇప్పటికే తమ వ్యక్తిగత చాట్స్‌ను యూజర్లు లాక్ చేసుకునే సదుపాయం ఉన్నా అందులో లోటుపాట్లు ఉండటంతో వాట్సప్ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దానివల్ల యూజర్లందరి సమాచార భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. న్యూ సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో యూజర్లు తమ చాట్స్‌కు వర్డ్స్, ఎమోజీలతో యూనిక్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో కేవలం సీక్రెట్ కోడ్‌ను టైప్ చేసి లాక్ అయిన చాట్‌ను యాక్సెస్ చేసేలా సెట్టింగ్స్‌ను తీసుకొచ్చారు. ఇదీ చదవండి: యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా? వాట్సాప్‌లో చాట్ లాక్ సీక్రెట్ కోడ్ ఫీచర్‌తో యూజర్లు యూనిక్ పాస్‌వర్డ్‌తో వారి చాట్స్‌ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చని మెటా కంపెనీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ బార్లో సీక్రెట్ కోడ్ టైప్ చేసినప్పుడే లాక్డ్ చాట్స్ కనిపించేలా యూజర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో ఏ ఒక్కరూ యూజర్ల ప్రైవేట్ సంభాషణలను గుర్తించలేరని వాట్సాప్ పేర్కొంది. ఇలా సెట్ చేసుకోండి.. వాట్సప్‌ను ముందుగా అప్డేట్ చేసుకోవాలి. లాక్డ్చాట్ విభాగానికి వెళ్లి అందులో పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో ‘హైడ్ లాక్డ్ చాట్స్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. లాక్ చేయాల్సిన చాట్లకు మళ్లీ యాక్సెస్ చేసుకోవడానికి రహస్య కోడ్‌ని ఎంటర్ చేయాలి. లాక్ చేసిన చాట్లు ప్రాథమిక చాట్ విండోలో కనిపించవు. హైడ్ చేసిన లాక్డ్చాట్లను ఓపెన్ చేయడానికి రహస్య కోడ్ ఎంటర్‌చేసి చూడాల్సి ఉంటుంది. -
Data protection: ఆ హామీ వివరాలను ప్రచారం చేయాలి
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ వేదిక వాట్సాప్ తన నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించని వినియోగదారులకు కూడా సేవలను కొనసాగిస్తామంటూ 2021లో కేంద్రానికి ఇచ్చిన హామీని ప్రచారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డేటా ప్రొటెక్షన్ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ అందులో వాట్సాప్ హామీ ఇచ్చిందని కూడా గుర్తు చేసింది. సంబంధిత హామీ వివరాలను అందరికీ తెలిసేలా ఐదు ప్రధాన పత్రికల్లో రెండు పర్యాయాలు ప్రచురించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 11న చేపడతామని తెలిపింది. పిటిషనర్ల తరఫున శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ విషయంలో వాట్సాప్ విధానాలు యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో వేరుగా ఉన్నాయన్నారు. వినియోగదారులు షేర్ చేసుకునే కాల్స్, ఫొటోలు, మెసేజీలు, వీడియోలు, డాక్యుమెంట్ల వివరాలను అందుబాటులో ఉంచేందుకు, వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వ్యక్తిగత భద్రతకు, వాక్ స్వాతంత్య్రానికి భంగ కరమంటూ కర్మణ్యసింగ్ సరీన్, శ్రేయ సేథి అనే విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి పైఆదేశాలిచ్చింది. ఈ బెంచ్‌లో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు. -
Twitter: ట్విటర్ కొత్త పాలసీ, కఠిన నిబంధనలు ఇవే..
Twitter New Rules 2021: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఇకపై ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు షేర్ చేయడంపై ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోనుంది. ట్విటర్ కొత్త పాలసీ నవంబర్ 30, 2021 నుంచి అమలులోకి వచ్చిందని ప్రకటించుకుంది. ఒక యూజర్ లేదంటే అథారిటీ కావొచ్చు.. అవతలి వాళ్ల అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాంటి పోస్టుల మీద గనుక ఫిర్యాదులు అందితే.. ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి ఆ పోస్ట్‌ను తొలగిస్తుంది ట్విటర్ . అయితే.. ఇదివరకే ట్విటర్లో ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. చిరునామాలు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, మెడికల్‌బిల్లులు, సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, జీపీఎస్ లొకేషన్, గుర్తింపు ఐడెంటిటీ కార్డులు, మెడికల్ రికార్డులు.. ఇలాంటి సమాచారం ట్విటర్లో షేర్ చేయడానికి వీల్లేదు. వీటికి తోడు ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్కు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం కూడా ఉల్లంఘనే అవుతుంది. ఇక కొత్త పాలసీ అప్డేట్ ప్రకారం.. పబ్లిక్ ఫిగర్స్, ప్రజా ప్రయోజనాల కోసం ఇతరులకు(నాన్ సెలబ్రిటీస్) సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. కానీ, అవి అభ్యంతరకరంగా ఉండి.. ఫిర్యాదులు అందితే మాత్రం వాటిని కూడా ట్విటర్ పరిశీలించి మరీ తొలగిస్తుంది. చర్యల్లో భాగంగా వ్యవహారం తీవ్రతను బట్టి అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయడమో లేదంటే పర్మినెంట్‌గా సస్పెండ్ చేయడమో జరుగుతుందని ట్విటర్ తెలిపింది. అమెరికాలో పబ్లిక్ ప్లేసుల్లో ఫొటోలు తీసి.. ట్విటర్లో అనుమతులు లేకుండా పోస్ట్ చేయడంలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఇక యూరోపియన్ చట్టాలు మాత్రం.. ఇలా ఫిర్యాదులు అందితే ఫొటోలు, వీడియోలను తొలగించేందుకు ఎప్పటి నుంచో అనుమతిస్తున్నాయి. అయితే యూజర్ల వ్యక్తిగత భద్రతను (Privacy) కాపాడేందుకు.. ఆయా దేశాల చట్టాలను అనుసరించి ఈ అప్డేట్ తీసుకొచ్చినట్లు ట్విటర్ ప్రకటించుకుంది. ట్విటర్లో ప్రైవసీ నిబంధనల అమలు అసలు ఉంటుందా? అనే అనుమానాలకు ట్విటర్ పైవిధంగా క్లారిటీ ఇచ్చింది. Beginning today, we will not allow the sharing of private media, such as images or videos of private individuals without their consent. Publishing people's private info is also prohibited under the policy, as is threatening or incentivizing others to do so.https://t.co/7EXvXdwegG — Twitter Safety (@TwitterSafety) November 30, 2021 -
గోప్యతా విధానం తాత్కాలికంగా ఆపేశాం!
న్యూఢిల్లీ: వివాదాస్పదమైన గోప్యతా విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం తెలిపింది. డేటా ప్రొటెక్షన్ బిల్లు అమల్లోకి వచ్చేంతవరకు తాము ప్రైవసీ విధానాన్ని నిలిపివేయడానికి అంగీకరించినట్టుగా వెల్లడించింది. కొత్త గోప్యతా విధానాలను అంగీకరించాలని తాము వినియోగదారులపై ఒత్తిడి తీసుకురామని ఢిల్లీ హైకోర్టు ఎదుట స్పష్టం చేసింది. వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే ‘‘మా ప్రైవసీ పాలసీ విధానాన్ని నిలిపివేయడానికి మేము అంగీకరించాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇక వినియోగదారులకు కనిపించవు. ఆ విధానాలను అంగీకరించాలని ఒత్తిడి తీసుకురాము’’ అని స్పష్టం చేశారు. డేటా పరిరక్షణ బిల్లు చట్టం రూపం దాల్చేవరకు పాత విధానానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోండి
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన నూతన ప్రైవసీ విధానం–2021ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్ యాజమాన్యాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్› అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటీసు జారీ చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పుల పట్ల ఐటీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచార విధానంలోని పవిత్రమైన విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంది. కొత్త పాలసీని అమలు చేస్తున్న తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరుల ప్రయోజనాలను, హక్కులను ఉల్లంఘించేలా కొత్త పాలసీ ఉందని తేల్చిచెప్పింది. నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని వాట్సాప్ యాజమాన్యానికి కేంద్ర ఐటీ శాఖ సూచించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. సమస్యాత్మకం, బాధ్యతారాహిత్యం భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కొత్త ప్రైవసీ పాలసీని ఎలా తీసుకొచ్చారని వాట్సాప్‌ను కేంద్రం నిలదీసింది. దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉన్న దృష్ట్యా.. భారత చట్టాల ప్రకారం వాట్సాప్‌పై చర్యలు తీసుకోవడానికి వీలున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ప్రైవసీ విధానం విషయంలో యూరప్ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల మధ్య వివక్ష చూపడం ఏమిటని వాట్సాప్‌ను కేంద్రం ప్రశ్నించింది. నిత్య జీవితంలో ఎంతోమంది భారతీయులు సమాచార మార్పిడి కోసం వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని గుర్తుచేసింది. దీన్ని అలుసుగా తీసుకొని భారతీయ వినియోగదారుల విషయంలో అనుచితమైన నియమ నిబంధనలు విధించడం సమస్యాత్మకమే కాదు బాధ్యతారాహిత్యం కూడా అని ఐటీ శాఖ ఉద్ఘాటించింది. యూరప్ వినియోగదారుల విషయంలో ఇలాంటి అనుచిత నియమ నిబంధనలు లేవని పేర్కొంది. నూతన ప్రైవసీ పాలసీ ప్రకారం.. భారతీయ వినియోగదారుల సమాచారాన్ని వాట్సాప్ యాజమాన్యం తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు చేరవేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిరంగం కావడం తథ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించడానికి మే 15న గడువుగా విధించిన వాట్సాప్ తర్వాత దాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత మరో మెలిక పెట్టింది. పాలసీని ఆమోదించాల్సిందిగా కొన్నాళ్లపాటు రిమైండర్లు పంపుతామని... అప్పటికీ ఓకే చెప్పకపోతే సదరు వినియోగదారుడికి క్రమేపీ చాటింగ్, వాయిస్‌కాల్స్, వీడియో కాల్స్ సేవలను నిలిపివేస్తామని తమ వెబ్సైట్లో పేర్కొంది. అయితే దీనికి నిర్దిష్ట గడువేమీ చెప్పకపోవడం గమనార్హం. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. -
Whatsapp: వాట్సాప్‌పై కేంద్రం గరం గరం
న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం గరం గరం అయ్యింది. నూతన ప్రైవసీ పాలసీలో చేపట్టిన మార్పులు భారతీయ పౌరుల గోప్యత, డేటా భద్రత, హక్కులు, ప్రయోజనాలకు హాని కలిగించేలా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వాట్సాప్ వెంటనే వివాదాస్పద కొత్త గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ లోపు సంతృప్తికరమైన స్పందన రాకపోతే చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశంలో 53 కోట్ల మంది వినియోగదారులను వాట్సాప్ కలిగి ఉంది. ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయ వినియోగదారుల పట్ల వాట్సాప్ అనుసరిస్తున్న వివక్ష ధోరణిని కేంద్రం ఖండిచింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీకి సంబందించిన మే15ను గడువును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అమలును వాయిదా వేసినంత మాత్రన ప్రజల ప్రయోజనాలను గుర్తించినట్లు కాదని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. నూతన ప్రైవసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో కూడా మంత్రిత్వ శాఖ ఇదే వైఖరిని అవలభించింది. చదవండి: తరిగిపోతున్న ఎలాన్ మస్క్ సంపద -
కొత్త ప్రైవసీ పాలసీకి అంగీకరించకపోతే... పరిమిత సేవలే: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ప్రైవసీ నిబంధనలు అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి పెంచుతోంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని మాతృసంస్థ ‘ఫేస్బుక్’తో పంచుకునేందుకు వీలు కల్పించేలా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఉందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే ఇప్పటికిప్పుడు ఖాతాను తొలగించకున్నా.. వినియోగదారులు పొందే సేవలు పరిమితం చేస్తామని వాట్సాప్ తాజాగా ప్రకటించింది. కొద్ది వారాల తర్వాత వినియోగదారులు తమ చాట్ లిస్టును చూడలేరని, ఆపై వాట్సాప్‌లో ఫోన్ కాల్స్‌ను, వీడియో కాల్స్‌ను అందుకోలేరని స్పష్టం చేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించడానికి మే 15వ తేదీని గడువుగా విధించిన వాట్సాప్... అలా చేయని ఖాతాదారుల తక్షణం వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, అకౌంట్‌ను తొలగించడం, సేవలకు అంతరాయం కలిగించడం చేయబోమని శుక్రవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలోనే తమ వెబ్సైట్లో అసలు విషయాన్ని బయటపెట్టింది. కొత్త ప్రైవసీ పాలసీలోని నియమనిబంధనలను అంగీకరించాలని వినియోగదారులకు కొద్దివారాల పాటు రిమైండర్లు (గుర్తుచేసే సందేశాలు) పంపుతామని, అప్పటికీ ఒప్పుకోని వారికి నిరంతరం సందేశాలు వెల్లువెత్తుతాయని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే వినియోగదారులకు ఎన్నివారాల గడువు ఇస్తున్నదీ స్పష్టం చేయలేదు. రిమైండర్ల తర్వాత కూడా స్పందించకపోతే వారు అందుకునే సేవలను పరిమితం చేస్తామని తెలిపింది. ఇలా కొద్దివారాల పరిమిత సేవల తర్వాత కూడా కొత్త ప్రైవసీ పాలసీని ఆమోదించని వారికి ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజ్‌లు నిలిపివేస్తామని వాట్సాప్ ప్రకటించింది. ఖాతాలను తొలగించబోమని చెబుతూనే... వాట్సాప్‌ను కొంతకాలం వాడని వినియోగదారుల విషయంలో తాము అనుసరించే విధానాన్ని ఎత్తిచూపింది. ఎవరైనా వాట్సాప్‌ను 120 రోజులు వినియోగించకపోతే... సదరు ఖాతాను వాట్సాప్ తొలగిస్తుంది. అంటే... ప్రైవసీ పాలసీని అంగీకరించకపోతే కొద్దివారాల తర్వాత మన ఫోన్లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఆపై సదరు ఖాతా ఇన్‌యాక్టివ్‌గా మారిపోతుంది. 120 రోజుల తర్వాత దీన్ని తొలగిస్తారన్న మాట. -
వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇప్పుడే కాదు
న్యూఢిల్లీ: వివాదాస్పద ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. మే 15వ తేదీలోగా ఖాతాదారులు దీన్ని ఆమోదించాలని, లేకపోతే ఖాతాలను రద్దు చేస్తామంటూ విధించిన డెడ్‌లైన్‌ను ఉపసంహరించుకుంది. ప్రైవసీ పాలసీ ఆప్డేట్ చేసుకోకపోయినా మే 15న ఖాతాలేవీ రద్దు కావని వాట్సాప్ అధికార ప్రతినిధి శుక్రవారం స్పష్టం చేశారు. భారత్‌లో వాట్సాప్ ఖాతాలన్నీ యథాతథంగా పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రైవసీ విధానంపై తదుపరి నిర్ణయాలను వినియోగదారులకు తెలియజేస్తామన్నారు. ఈ విధానంపై కొత్త నియమ నిబంధనలను మెజార్టీ వినియోగదారులు ఆమోదించారని గుర్తుచేశారు. కొందరికి మాత్రం ఇంకా ఆ అవకాశం రాలేదన్నారు. అయితే, డెడ్‌లైన్‌పై వెనక్కి తగ్గడానికి గల కారణాలను వాట్సాప్ యాజమాన్యం బయటపెట్టలేదు. కొత్త నిబంధనలను ఎంతమంది వినియోగదారులు ఆమోదించారో చెప్పలేదు. ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ యాజమాన్యం ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఫిబ్రవరి 8లోగా వీటిని ఆమోదించాలని గడువు విధించింది. అనంతరం ఈ డెడ్‌లైన్‌ను మే 15 దాకా పొడిగించింది. కొత్త పాలసీలో భాగంగా తమ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సాప్ యాజమాన్యం పంచుకుంటోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే, దీన్ని వాట్సాప్ కొట్టిపారేసింది. -
వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సీసీఐ విచారణ
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా అప్డేట్ చేస్తున్న ప్రైవసీ విధానంపై క్షుణ్నంగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమ దర్యాప్తు విభాగం డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని సూచించింది. వాట్సాప్ అప్డేట్ పాలసీపై మీడియా వార్తల ఆధారంగా సుమోటో ప్రాతిపదికన విచారణ చేపట్టిన సీసీఐ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వాట్సాప్ తీరు .. పోటీ చట్టాల నిబంధనలను ఉల్లంఘించేదిగాను, పాలసీ అప్డేట్ ముసుగులో దోపిడీ ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగాను ఉందని సీసీఐ ఆక్షేపించింది. వాట్సాప్ వినియోగించుకోవడాన్ని కొనసాగించాలంటే .. దాని మాతృ సంస్థ ఫేస్బుక్లో భాగమైన ఇతర కంపెనీలతో డేటాను పంచుకునే విధంగా యూజర్లు తప్పనిసరిగా కొత్త పాలసీకి అంగీకరించి తీరాల్సిందే అన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనికి సహేతుకమైన కారణాలేమీ కనిపించడం లేదని సీసీఐ అభిప్రాయపడింది. -
ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్ క్లారిటీ
న్యూఢిల్లీ: యూజర్ల వ్యక్తిగత సంభాషణల డేటా గోప్యత పాటించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి కూడా తెలియజేశామని మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. కొత్త ప్రైవసీ పాలసీని ముందుగా ప్రకటించినట్లు మే 15 నుంచి అమల్లోకి తేనున్నట్లు వివరించింది. అయితే యూజర్లు ఈ అప్డేట్ గురించి యాప్ ద్వారా పూర్తి వివరాలు తీరిగ్గా చదువుకునేందుకు, తగినంత సమయం ఉంటుందని పేర్కొంది. ‘తప్పుడు ప్రచారం, యూజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ బట్టి వాట్సాప్ సర్వీసుల నిబంధనలను అంగీకరించేందుకు ఉద్దేశించిన గడువును మే 15 దాకా పొడిగించాం. ఈలోగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. వారి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాం‘ అని వాట్సాప్ ఒక బ్లాగ్‌పోస్టులో పేర్కొంది. అప్డేట్ ఓకే చేయకున్నా కాల్స్ వస్తాయి కానీ.. రాబోయే రోజుల్లో అప్డేట్ గురించిన సమాచారాన్ని యాప్‌లో బ్యానర్‌గా డిస్ప్లే చేయనున్నట్లు వివరించింది. యూజర్ల సందేహాలన్నీ నివృత్తి చేసేలా దీన్ని తీర్చిదిద్దినట్లు, జనవరిలో చూసిన దానికి భిన్నంగా కొత్త ఇన్–యాప్ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మే 15 నాటికి కూడా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయినా ఆయా యూజర్లు .. కాల్స్, నోటిఫికేషన్స్ పొందవచ్చని, కానీ మెసేజీలు పంపాలంటే మాత్రం అప్డేట్కి అంగీకరించాల్సి ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. తమ మెసేజింగ్ యాప్ ద్వారా వ్యాపార సంస్థలతో లావాదేవీలు జరిపే యూజర్లకు సంబంధించిన కొంత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ కంపెనీలతో పంచుకునే విధంగా వాట్సాప్ అప్డేట్ ప్రకటించడం వివాదాస్పదంగా మారడం తెలిసిందే. -
లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం
న్యూఢిల్లీ: యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల గోప్యతను తక్కువగా చూస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌కి సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతపౌరుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రూ.లక్షల కోట్ల కన్నా, ప్రజలు తమ వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందంటూ, వాట్సాప్ గోప్యతా విధానంపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఫేస్బుక్, వాట్సాప్‌లను ఉద్దేశించి.. ‘మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారు’ అని వ్యాఖ్యానించింది. ► నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్‌ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ► కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు. ► వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఒక్క యూరప్‌లో తప్ప భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఒకే రకంగా ఉందని, యూరోపియన్లకు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉందని, భారత్‌లో పార్లమెంటు అదే విధమైన చట్టం చేస్తే వాట్సాప్ దాన్ని అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం భారత పౌరుల డేటాను షేర్ చేయొచ్చు’ అని అన్నారు. ► ఇటీవల వాట్సాప్ కంపెనీ నూతన గోప్యతా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను వెల్లడించింది. భారత ప్రభుత్వం నోటీసుల మేరకు నూతన గోప్యతా విధానం అమలును మే 15కి వాయిదావేశారు. వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ఇది భారతీయులకు ఒకలా, యూరోపియన్స్‌కి మరోలా అమలు చేస్తున్నారు అని పిటిషనర్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది శ్యామ్ దివాన్ ఆరోపించారు. ‘యూరప్‌లో ఎవరికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నైనా ఇతరులకు షేర్ చేయాల్సి వస్తే, దానికి ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ పాలసీనే భారత్‌కూ అన్వయించాలి’ అని దివాన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించే వరకు వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని అమలుచేయరాదని ఆదేశించాల్సిందిగా కోర్టుని కోరారు. ► ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. ► తమ లబ్ధికోసం వినియోగదారుల డేటాని ఇతరులకు ఇస్తున్నారంటూ పిటిషన్‌దారుడు నూతన ప్రైవసీ పాలసీని సవాల్ చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో 2017లో రాజ్యాంగ ధర్మాసనం ‘ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకి సంబంధించిన పెద్ద సమస్య’ అని వ్యాఖ్యానించినట్టు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ► డేటా షేరింగ్ విషయంలో తమ విధానం ఏమిటో వాట్సాప్, ఫేస్బుక్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ అన్నారు. -
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం చివాట్లు
-
వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీం చివాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీరు బిలియన్, ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది అని స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ కొత్త పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. వాట్సాప్ తన యూజర్ల బిజినేస్ సంభాషణలను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ కొత్త పాలసీని అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి వారి మొబైల్స్‌లో వాట్సాప్ పని చేయదని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుంతుదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కర్మన్య సింగ్ సరీన్, మరికొందరు కొత్త ప్రైవసీ పాలసీపై స్టే విధించాల్సిందిగా కోరతూ సుప్రీం కోర్టును కోరారు. ఈ అభ్యర్థన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు(వాట్సాప్) బిలియన్, ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకన్నా విలువైనది. దానిని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటాం’’ అని తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక వాట్సాప్, ఫేస్బుక్ తరఫున కపిల్ సిబాల్, అరవింద్ దాతర్ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. చదవండి: వెనక్కి తగ్గిన వాట్సాప్ -
వాట్సాప్ కొత్త పాలసీపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: నూతన వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇండియన్ యూజర్లు విచారం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్ లకు తరలివెళ్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో వాట్సాప్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్బంగా కేంద్రం వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) యూరోపియన్ వినియోగదారులు, భారతీయ వినియోగదారులను వాట్సాప్ వేర్వేరుగా చూస్తుందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త పాలసీ నిబంధనలకు సంబందించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాట్సాప్ కు లేఖ పంపినట్లు విచారణ సందర్భంగా అడిషిషనల్ సోలిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల గోప్యతా విషయంలో "ఏకపక్షంగా" వ్యవహరిస్తుందని ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.(చదవండి: ఇండియన్ పబ్జీ(ఫౌజీ) విడుదల రేపే!) మళ్లీ మార్చి 1కి వాయిదా యూరోపియన్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం కావడంతో అక్కడ తప్పనిసరిగా వాట్సాప్ నిబంధనలను అంగీకరించాలనే నిబంధన లేదు.. కానీ ఇండియాలో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోందని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. ఈ అంశం వినియోగదారుల సమాచారం భద్రత, గోప్యతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. అయితే ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
పారదర్శకతే లక్ష్యం: వాట్సాప్
న్యూఢిల్లీ: ప్రైవసీ పాలసీలో ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలంటూ కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పందించింది. ప్రతిపాదిత అప్డేట్ వల్ల మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను మరింతగా పంచుకోవడమనేది జరగదని వివరించింది. పారదర్శకంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించేందుకు, మరింత మందికి చేరువయ్యేందుకు అవసరమైన అవకాశాలను అందుబాటులో ఉంచడం తమ ఉద్దేశమని తెలిపింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించింది. దీనిపై ఎలాంటి ప్రశ్నలకైనా వివరణనిచ్చేందుకు సదా అందుబాటులో ఉంటామని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర గ్రూప్ సంస్థలతో తమ యూజర్ల వివరాలను పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త వెనక్కి తగ్గి.. అప్డేట్ను మే 15 దాకా వాయిదా వేసింది. అటు కేంద్రం కూడా ఘాటుగా హెచ్చరించడంతో తాజా వివరణ ఇచ్చింది. -
డక్‌డక్‌గో.. గూగుల్‌కు పోటీ ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాల్లో ఒకే కంపెనీ ఆధిపత్యం ఇక ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. రోజువారీ జీవితంలో భాగమైన వాట్సాప్ వంటి యాప్‌లనే ప్రైవసీ పాలసీ అప్డేట్స్ కారణంగా పక్కనపెడుతున్న యూజర్లు.. ప్రైవసీకి పెద్దపీట వేసే ఇంటర్నెట్ సాధనాలు, సోషల్‌మీడియా యాప్‌ల వైపు దృష్టి సారించారు. వాట్సాప్‌ను కాదని సిగ్నల్ వైపు మళ్లినట్టే నెటిజన్లు సెర్చ్ ఇంజిన్‌కూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. తమ డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్ ఇంజిన్ల వైపు మళ్లుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌కు యూజర్లు పెరుగుతుండడం ఈ కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. గూగుల్‌కు పోటీ ఉందా? ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో రోజుకు 350 కోట్ల సెర్చ్ క్వెరీస్ నమోదవుతున్నట్టు అంచనా. అంటే 350 కోట్ల ప్రశ్నలు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను రోజూ పలుకరిస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ల వాడకంలో 90 శాతం వాటా గూగుల్‌దే. మిగిలిన సెర్చ్ ఇంజిన్లు బింగ్ (2.78 శాతం వాటా), యాహూ (1.60 శాతం), బైదు (0.92 శాతం), యాండెక్స్ (0.85 శాతం), డక్‌డక్‌గో (0.50 శాతం) బరిలో ఉన్నాయి. అయితే ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రైవసీ మీద చర్చ జరుగుతుండడంతో యూజర్ల డేటా సేకరించే యాప్‌ల వాడకాన్ని వినియోగదారులు తగ్గిస్తున్నారు. ఇదే సమయంలో డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ క్వెరీస్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా రోజుకు 10 కోట్ల సెర్చ్ క్వెరీస్ మైలురాయిని డక్‌డక్‌గో అందుకుంది. ఇందుకు కారణంగా డక్‌డక్‌గో ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది. యూజర్ల ఐపీ అడ్రస్ వంటివి ఇది సేకరించదు. నిజానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు వచ్చే క్వెరీస్తో పోల్చితే ఇది చాలా తక్కువ. కానీ క్రమంగా పెరుగుతున్న క్వెరీస్ సంఖ్యను బట్టి డక్‌డక్‌గోకు ఆదరణ పెరుగుతోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డక్‌డక్‌గో ఎందుకు? ఇతర సెర్చ్ ఇంజిన్లకు తాము భిన్నమని, అవి తనకు వచ్చే సెర్చ్ క్వెరీల ఆధారంగా యూజర్‌ను ట్రాక్ చేస్తాయని, భారీ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కలిగి ఉన్న సెర్చ్ ఇంజిన్లు.. అడ్వర్టయిజర్లను ఆకర్షించుకునేందుకు యూజర్ల డేటా వాడుకుంటున్నాయని, కానీ తాము వాటికి దూరంగా ఉంటామని డక్‌డక్‌గో చెబుతోంది. సెర్చ్ ఇంజిన్లలో ఇచ్చే క్వెరీ ఆధారంగా థర్డ్ పార్టీ సోషల్ మీడియా యాప్‌లలో యాడ్స్ ప్రత్యక్షమవుతాయని చెబుతోంది. కానీ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసేలా తాము బిజినెస్ మోడల్‌ను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్లు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ ట్రాకర్లు మన బ్రౌజింగ్, లొకేషన్, సెర్చ్, కొనుగోళ్ల వివరాలు సేకరించి మన బిహేవియరల్ ప్రొఫైల్‌ను సిద్ధంచేసుకుంటాయి. తద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి. పెద్ద సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా యాప్‌లు యూజర్లను ట్రాక్ చేస్తూ తమ యాడ్ నెట్వర్క్ కోసం డేటాను వినియోగిస్తున్నాయని చెబుతోంది. తమ సెర్చ్ ఇంజిన్‌లో ఉన్న ప్రైవసీ ఎసెన్షియల్స్‌ను వాడడం వల్ల థర్డ్ పార్టీ ట్రాకర్లు పనిచేయవని డక్‌డక్‌గో చెబుతోంది. తాము కేవలం యూజర్లు ఇచ్చే క్వెరీ ఆధారంగా యాడ్ చూపిస్తామని, కానీ యూజర్ బ్రౌజింగ్ ఆధారంగా బిహేవిరియల్ యాడ్స్ ఉండవని చెబుతోంది. అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్పీ) నుంచి నిఘా కూడా ఉండదని చెబుతోంది. ఐఎస్పీ నుంచి నిఘా ఉంటే.. మన బ్రౌజింగ్ డేటాను అది వినియోగించుకోవడం, అమ్ముకోవడం చేస్తుందని హెచ్చరిస్తోంది. తాము ఐపీ అడ్రస్‌ను కూడా సేకరించమని చెబుతోంది. ఫేస్బుక్ డేటా సేకరణపైనా చర్చ.. ఫేస్బుక్ గత ఏడాది తెచ్చిన కొత్త ఫీచర్ ఆధారంగా యూజర్లు ఫేస్‌బుక్‌పై కాకుండా ఇతరత్రా బ్రౌజింగ్ చేసినా ఆ యాక్టివిటీని సేకరిస్తోంది. ఫేస్బుక్ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’ని క్లిక్ చేసి, మళ్లీ ‘మేనేజ్ యువర్ ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’ని క్లిక్ చేసి, అందులో ఉండే ‘మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ’లో టర్న్ ఇట్ ఆఫ్ అని నొక్కితే యాక్టివిటీ డేటాను సేకరించడం ఆపుతుంది. దీని వల్ల మనకు యాడ్స్ అంతేసంఖ్యలో కనిపించినప్పటికీ.. అవి మన యాక్టివిటీని బట్టి ఉండవు. కానీ మన ఫేస్బుక్ ఖాతా, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో యాక్టివిటీని బట్టి యాడ్స్ కనిపిస్తాయి. ఇటీవల వాట్సాప్ ప్రైవసీ అప్డేట్స్పై భారీఎత్తున చర్చ జరిగిన సందర్భంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’పై కూడా చర్చ జరుగుతోంది. యూజర్ల డేటాను యాప్‌లు తమ వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలోనే యూజర్లు ప్రైవసీకి పెద్దపీట వేసే సోషల్ మీడియా యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. -
వెనక్కి తగ్గిన వాట్సాప్
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై వెనకడుగు వేసింది. కొత్త విధానాన్ని మే 15వ తేదీకి వాయిదా వేసింది. వ్యక్తిగత డేటాను మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటోందంటూ భారత్ సహా ప్రపంచదేశాల వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఫిబ్రవరి 8వ తేదీన ఎవరి అకౌంట్‌నూ సస్పెండ్ చేయడం/ తొలగించడం జరగవు. వాట్సాప్‌లో గోప్యత, భద్రతా పరమైన అంశాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు మేం చాలా చేయాల్సి ఉంది. ఆ తర్వాతే, ప్రస్తుత విధానాల్లో క్రమేపీ పరిశీలన జరిపి, మే 15వ తేదీ కల్లా కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెస్తాం’అని బ్లాగ్ పోస్ట్‌లో వాట్సాప్ ప్రకటించింది. ‘ఇటీవలి అప్డేట్ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఎంతో అయోమయానికి గురయ్యారు. ఎన్నో అనుమానా లు తలెత్తాయి. మా విధానాలు, వాస్తవాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేందుకు సాయపడాలనుకుం టున్నాం’అని అందులో తెలిపింది. వాట్సాప్ వేదికపై ఉండే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పూర్తిస్థాయిలో సంకేత రూపంలో ఉంటుంది. ఈ మెసేజీలను వాట్సాప్ గానీ, ఫేస్బుక్ గానీ చూడలేదని కూడా స్పష్టత ఇచ్చింది. యూజర్ల మెసేజీలు, కాల్లకు సంబంధించి తాము ఎలాంటి రికార్డులను నిర్వహించడం లేదని పేర్కొంది. వినియోగదారుల లొకేషన్ కూడా బయటకు వెల్లడయ్యేందుకు అవకాశం లేదని తెలిపింది. ఇటీవల ప్రకటించిన విధానం కారణంగా వ్యక్తిగత మెసేజీలపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలిపింది. 40 కోట్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో వాట్సాప్ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సేవలు, విధానాల్లో మార్పులు చేపట్టినట్లు వాట్సాప్ గత వారం తెలిపింది. దీని ప్రకారం వినియోగదారులు తమ వాట్సాప్ సేవలను కొనసాగించాలంటే ఫిబ్రవరి 8వ తేదీ కల్లా ఈ విధానాలకు సమ్మతించాల్సి ఉందని తెలిపింది. వాట్సాప్ ప్రకటించిన వ్యక్తిగత గోప్యత విధానాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం కూడా ప్రకటించింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన వాట్సాప్ తాజా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. వాట్సాప్‌లో వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో లక్షలాదిగా వినియోగదారులు గత కొద్ది రోజులుగా సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. -
వాట్సాప్ అప్డేట్.. మరో 3 నెలలు వాయిదా
ముంబై: నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. పది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్ మొబైల్ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ పని చేయదని ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్.. యూజర్ వ్యక్తిగత సమాచారం, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఇక వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను డిలీట్ చేసి.. టెలిగ్రాం, సిగ్నల్ యాప్స్‌కి మారారు. ఈ పరిస్థితులతో వాట్పాప్ మేలుకొన్నది. తన అప్డేట్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్‌లో ‘‘మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా మీ మధ్యే ఉంటుందనే ఐడియా మీద వాట్సాప్‌ని అభివృద్ధి చేశాం. మీ వ్యక్తిగత సంభాషణని ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ పద్దతిలో మేం రక్షిస్తాం. వాట్సాప్, ఫేస్బుక్ మీ సందేశాలను చదవదు.. మీరు పంపే లోకేషన్లని చూడదు.. మీరు ఎవరికి కాల్ చేశారు.. ఎవరితో మెసేజ్ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోం’’ అని తెలిపింది. (చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..? ) ఇక ‘‘ఈ నూతన అప్డేట్ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్డేట్ని తీసుకొచ్చాం. మేము డేటాను ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము అనే దానిపై ఇది మరింత పారదర్శకతను అందిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ బిజినెస్‌తో షాపింగ్ చేయకపోయినా, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ సేవల గురించి ముఖ్యమైన వ్యక్తులకు తెలుసు. ఈ అప్డేట్ ఫేస్‌బుక్‌తో డాటాను పంచుకునే మా సామర్థ్యాన్ని పెంచదు’’ అని స్పష్టం చేసింది. ఇక ‘‘యూజర్లు కొత్త అప్డేట్ను అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 8 న ఎవరి అకౌంట్లను నిలిపివేయం.. తొలగించం. అలానే వాట్సాప్‌లో గోప్యత, భద్రత ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. మే 15న కొత్త బిజినెస్ ఫీచర్ అందుబాటులోకి రాకముందే మేము పాలసీని సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తాము’’ అన్నది. (చదవండి: వాట్సాప్ కి పోటీగా 'సిగ్నల్' యాప్) ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావడానికి వాట్సాప్ సహాయపడింది. ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు, భవిష్యత్తులో రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. గందరగోళ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లను ఆపడానికి, వాస్తవాలను ప్రచారం చేయడానికి సహాయం చేసిన వారందరికి ధన్యవాదాలు. వ్యక్తిగత సంభాషణ చేయడానికి వాట్సాప్‌ను ఉత్తమమైన మార్గంగా నిలపడానికి మేం నిరంతరం కృషి చేస్తాం’’ అని తెలిపింది. -
ఫుల్ సిగ్నల్.. జోరుగా టెలిగ్రాం!
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానాలు మారనుండటం .. దాని పోటీ సంస్థలకు ఊహించని వరంగా మారుతోంది. వాట్సాప్ కొత్త పోకడలు నచ్చని యూజర్లు ఎకాయెకిన ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో .. సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాట్సాప్ వివాదాస్పద మార్పులు ప్రకటించిన గత కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తమ యాప్ డౌన్లోడ్లు లక్షల సంఖ్యలో పెరిగాయని సిగ్నల్ సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ యాక్టన్ వెల్లడించారు. ఇక భారత మార్కెట్లో తమకు అంచనాలు మించిన ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘గడిచిన కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో వృది నమోదైంది. 40 దేశాల్లో ఐవోఎస్ యాప్ స్టోర్‌లో మాది టాప్ యాప్‌గా ఉంది. అలాగే 18 దేశాల్లో గూగుల్ ప్లేలో నంబర్ వన్‌గా నిల్చింది. ఈ రెండు సిస్టమ్స్‌లో 1 కోటి పైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గడిచిన మూడు–నాలుగు రోజుల్లో అసాధారణ వృద్ధి, యూసేజీ కనిపిస్తోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు‘ అని యాక్టన్ తెలిపారు. సరళతరమైన .. సులువైన నిబంధనలు, ప్రైవసీ పాలసీతో యూజర్లకు మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2009లో వాట్సాప్‌ను జాన్ కౌమ్‌తో కలిసి యాక్టన్ నెలకొల్పారు. ఆ తర్వాత వాట్సాప్‌ను కొనుగోలు చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ .. దాన్నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు అనుసరించిన విధానాలు నచ్చక యాక్టన్ బైటికొచ్చేశారు. మోక్సీ మార్లిన్‌స్పైక్‌తో కలిసి సిగ్నల్‌ను ప్రారంభించారు. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా యూజర్ల డేటాను పంచుకునే విధంగా పాలసీని అప్డేట్ చేస్తున్నామని, తమ యాప్‌ను వాడాలంటే కచ్చితంగా ఇందుకు సమ్మతించాల్సి ఉంటుందని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై చిర్రెత్తుకొచ్చిన యూజర్లు పొలోమంటూ ప్రత్యామ్నాయ యాప్స్ వైపు మళ్లుతున్నారు. టెలిగ్రాం రయ్... ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటినట్లు టెలిగ్రాం వెల్లడించింది. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా 2.5 కోట్ల మంది యూజర్లు చేరినట్లు వివరించింది. భారత్‌లో యూజర్ల సంఖ్యను ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ .. కొత్త యూజర్లు .. ఆసియాలో అత్యధికంగా 38 శాతం మంది చేరినట్లు వెల్లడించింది. యూరప్ (27 శాతం), లాటిన్ అమెరికా (21 శాతం), మధ్య ప్రాచ్యం.. ఉత్తర ఆఫ్రికా ప్రాంతం (8 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సెన్సార్ టవర్ అనే సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో జనవరి 6–10 తారీఖుల మధ్య కొత్తగా 15 లక్షల మేర టెలిగ్రాం డౌన్లోడ్స్ నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదే ధోరణి కొనసాగితే సమీప భవిష్యత్తులో త్వరలోనే 100 కోట్ల యూజర్ల మార్కును సాధించగలమని టెలిగ్రాం సీఈవో పావెల్ దురోవ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘గత ఏడేళ్లలో అనేకసార్లు డౌన్లోడ్లు ఒకేసారిగా పెరిగిపోవడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిస్థితి మాత్రం కాస్త భిన్నమైనది. ఉచిత సర్వీసుల కోసం తమ ప్రైవసీని పణంగా పెట్టేందుకు యూజర్లు సిద్ధంగా లేరు. ప్రారంభం నుంచీ మేం యూజర్ల వివరాల గోప్యతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇతర యాప్‌లలాగా ఆదాయం కోసం మేం జవాబు చెప్పుకునేందుకు టెలిగ్రాంలో షేర్హోల్డర్లు గానీ ప్రకటనకర్తలు గానీ లేరు. ఇప్పటిదాకా మా యూజర్ల వ్యక్తిగత డేటా ఏదీ కూడా ఎవరికీ వెల్లడించలేదు‘ అని దురోవ్ పేర్కొన్నారు. -
మస్క్ రాంగ్ ‘సిగ్నల్’.. షేరు పరుగు!
ఒక శక్తివంతమైన మాట.. కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంటుంది. ఇందుకు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్.. వాట్సాప్.. సిగ్నల్ ఉదంతమే నిదర్శనం. మెసేజింగ్ కోసం సిగ్నల్ యాప్‌ను వాడాలంటూ మస్క్ ఇచ్చిన పిలుపుతో సిగ్నల్ షేరు భారీ స్థాయిలో ఎగిసింది. కానీ, చిత్రమేమిటంటే.. మస్క్ చెప్పిన సిగ్నల్ అనే కంపెనీ అసలు స్టాక్ ఎక్సే్ఛంజీల్లోనే లిస్టే కాలేదు. వాస్తవానికి ఈ సిగ్నల్‌కు దక్కాల్సిన క్రెడిట్ అంతా అదే పేరున్న మరో లిస్టెడ్ కంపెనీకి దక్కింది. వివరాల్లోకి వెళితే.. మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవలే తన ప్రైవసీ నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటి ప్రకారం యూజర్లకు సంబంధించిన పలు వివరాలను అది మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో కూడా పంచుకోనుంది. ఇందుకు సమ్మతించిన యూజర్లకు మాత్రమే తమ యాప్ అందుబాటులో ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. సాధారణంగానే వ్యక్తిగత వివరాల గోప్యతకు ప్రాధాన్యమిచ్చే యూజర్లకు ఈ కొత్త నిబంధనను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. ప్రపంచ కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఇలాంటి యూజర్లలో ఒకరు. వాట్సాప్‌కు గుడ్‌బై చెప్పి ఇలాంటి ప్రైవసీ నిబంధనల బాదరబందీ లేని సిగ్నల్ అనే యాప్‌కు మారిపోవాలంటూ పిలుపునిచ్చారు. దీంతో సిగ్నల్ యాప్ డౌన్లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దెబ్బతో యూజర్లు చేజారకుండా చూసుకునేందుకు వాట్సాప్ పలు వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. యాప్‌లకు సంబంధించి ఇక్కడి వరకూ కథ బాగానే ఉన్నప్పటికీ.. ఈ నాలుగైదు రోజుల్లో అమెరికన్ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అడ్వాన్స్ షేరు రయ్... మస్క్ చెప్పిన సిగ్నల్ అనేది ఒక లాభాపేక్ష లేని ఓ సంస్థ నిర్వహణలోని మెసేజింగ్ యాప్. వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, టెలిగ్రాం వంటి వాటికి ప్రత్యామ్నాయం మాత్రమే. దీనికి స్టాక్ ఎక్సే్చంజీలకు సంబంధం లేదు. అయితే, ఇదే పేరుతో సిగ్నల్ అడ్వాన్స్ అనే మరో లిస్టెడ్ కంపెనీ ఉంది. మస్క్ సూచించిన సిగ్నల్ ఇదే అయి ఉంటుందనుకున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. సిగ్నల్ అడ్వాన్సెస్ షేరు కోసం ఎగబడ్డారు. దీంతో ఆ షేరు ఒకే రోజు ఏకంగా 527 శాతం ఎగిసింది. ఆ తర్వాత రోజు మరో 91 శాతం పెరిగింది. దీంతో ఆరేళ్లుగా ఏనాడు 1 డాలరు మార్కు కూడా దాటని సిగ్నల్ అడ్వాన్స్ షేరు ధర 60 సెంట్ల స్థాయి నుంచి ఏకంగా 7.19 డాలర్లకు దూసుకెళ్లిపోయింది. మార్కెట్ క్యాప్ 55 మిలియన్ డాలర్ల నుంచి అమాంతంగా 600 మిలియన్ డాలర్లకు ఎగిసింది. చివరికి సదరు సిగ్నల్ అడ్వాన్స్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని సిగ్నల్ మెసేజింగ్ యాప్ స్వయంగా వివరణ ఇచ్చుకుంటే తప్ప షేరు పరుగు ఆగలేదు. గతంలోనూ.. ఇలా ఇన్వెస్టర్లు ఒక కంపెనీ బదులు మరో కంపెనీ షేరు కోసం ఎగబడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. 2019 ఏప్రిల్‌లో జూమ్ వీడియో కమ్యూనికేషన్ అనే సంస్థ లిస్టయిన రోజున దాదాపు అలాంటి పేరే ఉన్న జూమ్ టెక్నాలజీస్ అనే కంపెనీ షేరు .. రెండు గంటల వ్యవధిలో 80 శాతం పైగా ఎగిసింది. అయితే, తేడా తెలిసిన తర్వాత అదంతా తగ్గిపోయి చివరికి 10 శాతం లాభంతో క్లోజయ్యింది. ఇక మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ట్విట్టర్ లిస్టింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న మార్కెట్ వర్గాలు ట్వీట్టర్ హోమ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ అనే సంస్థ షేర్లను ఎడాపెడా కొనేశారు. దీంతో దాని షేరు 1,000 శాతం పైగా పెరిగిపోయింది. -
‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ : ‘ఆరోగ్య సేతు’ యాప్ డేటా సెక్యూరిటీకి ఎలాంటి సమస్య లేదని, సమాచారం సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా ఇప్పటి వరకు ఎటువంటి భద్రతా ఉల్లంఘనలు గుర్తించలేదని, ఆరోగ్యా సేతు ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది కరోనా సమాచారాన్ని తెలుసుకునేందుకు, మనలో కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో తెలిపి, పలు సలహాలు సూచనలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ప్రజల సమాచారం భద్రంగా లేదంటూ, వివరాలు హ్యకింగ్ చేసే అవకాశం ఉందని ఫ్రెంచ్ హ్యకర్ మంగళవారం ట్విటర్లో ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. (విషాదం: ‘వాడిని కనీసం ముట్టుకోలేకపోయా’) ఈ యాప్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇందులో సెక్యూరిటీ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 90 మిలియన్ల మంది భారతీయుల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించాడు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం హ్యాకర్ వాదనలను తోసిపుచ్చింది. ప్రజల సమాచారానికి ఎటాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, డేటా చోరీ కాలేదని పేర్కొంది. యాప్ ఉపయోగిస్తున్న ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా హ్యకింగ్‌కు గురవ్వలేదని ట్విటర్లో క్లారిటీ ఇచ్చింది. కాగా ఆరోగ్యా సేతు ట్విట్టర్లో విడుదల చేసిన ప్రకటనపై హ్యకర్ ఇలియట్ ఆల్డర్సన్ స్పందించారు. ‘యాప్‌లో ఎలాంటి లోపాలు లేవని మీరు చెప్పారు. మేము దానిని సమీక్షించి రేపు మళ్లీ వస్తాం’.. అంటూ బదులిచ్చాడు. Statement from Team #AarogyaSetu on data security of the App. pic.twitter.com/JS9ow82Hom — Aarogya Setu (@SetuAarogya) May 5, 2020 Basically, you said "nothing to see here" We will see. I will come back to you tomorrow. https://t.co/QWm0XVgi3B — Elliot Alderson (@fs0c131y) May 5, 2020 -
భయం ఉంటే వాట్సప్ వాడొద్దు...
న్యూఢిల్లీ: వాట్సప్ తన వినియోగదారులకు షాక్ ఇస్తోంది. వినియోగదారుల సమాచారానికి తాము కల్పించే భద్రత పట్ల అసంతృప్తి ఉంటే వాట్సప్ నుంచి వైదొలగొచ్చని తెలిపింది. గతేడాది వాట్సప్ డేటాని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో షేర్చేస్తూ సరికొత్త ప్రైవసీ పాలసీని ప్రవేశ పెట్టింది. దీంతో వాట్సప్ వినియోగదారుల డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అయింది. కొత్త ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పలు కేసులు నడుస్తున్నాయి. భారత్‌లో కూడా దీనిపై కేసు నమోదు అయింది. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో భాగంగా వాట్పప్ ప్రైవసీ పాలసీపై భయం, అనుమానం ఉన్న వ్యక్తులు వాట్సప్ మానేయొచ్చని వాట్సప్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టులో వాదించారు. వాట్సప్ ఇప్పటి వరకూ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్సన్ భద్రతని అందిస్తోంది. అంతకు మించి భద్రత అందించలేమని వాట్సప్ వాదిస్తోంది.ఎవరైతే ఫేస్బుక్ వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీతో తమ ప్రాధమిక హక్కులను హరిస్తుందని భావిస్తున్నరో వారు ఆ సర్వీసులను వాడటం ఆపేయవచ్చని ఫేస్బుక్ తరపు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు.భారతీయుడి ప్రాధమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటీషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. -
వాట్సాప్‌కు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై ఇటీవల విమర్శల పాలవుతున్న వాట్సాప్, ఫేస్బుక్ లకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని సుప్రీం వ్యతిరేకించింది. వీటిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. చీఫ్‌జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా వాట్సాప్, ఫేస్బుక్ నిబంధనలు రూపొందించుకోవడంపై సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియాలో సమాచార భద్రత లేకపోవడంతో వినియోగదారుల ప్రైవసీకి నష్టమంటూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఈ ఏడాది జనవరిలో వాట్సాప్, ఫేస్బుక్, కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా సోషల్ నెట్‌వర్కింట్ సైట్లువాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలోని 15.7 కోట్ల మందికిపైగాఉన్న యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయని, ఇది హక్కుల ఉల్లంఘన అని విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్ వినియోగదారుల డాటాను ఫేస్‌బుక్‌తో షేరింగ్ చేసుకునేలా ప్రైవసీ పాలసీలో మార్పులు చేసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్నసంగతి తెలిసిందే. -
వాట్సాప్‌కు ఎదురుదెబ్బ
ప్రముఖ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందటి ప్రైవసీ పాలసీ ఆధారంగా 2016 సెప్టెంబర్ 25వరకు సేకరించిన యూజర్ల సమాచారాన్ని ఫేస్బుక్ లేదా మరే ఇతర కంపెనీకి షేరు చేయడానికి వీలులేదని హైకోర్టు తీర్పునిచ్చింది. చీఫ్ జస్టిస్ జీ రోహిణి నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చాక వాట్సాప్‌ను వాడకూడదని నిర్ణయించుకున్న యూజర్ల డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని కూడా ఆదేశించింది.యూజర్లు కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చుకోవడానికి వాట్సాప్ 30 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గడువు సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఈ కొత్త ప్రైవసీ పాలసీ విధానం ద్వారా యూజర్ల సమాచారాన్ని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ షేరు చేయనుంది. ఫేస్‌బుక్‌తో తమ సమాచారాన్ని షేరు చేసుకోవడానికి ఇష్టపడని వారు అకౌంట్ డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నట్టు బెంచ్ సభ్యులు జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ తెలిపారు. అదేవిధంగా వాట్సాప్ లాంటి ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులను చట్టబద్ధమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వాట్సాప్ డేటా షేరింగ్‌ను సవాలు చేస్తూ ఇద్దరు విద్యార్థులు కర్మాన్య సింగ్ సరీన్, శ్రేయ సేతీలు ఢిల్లీ హైకోర్టు గడపతొక్కారు. విద్యార్థుల ఫిర్యాదుపై విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యార్థుల తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రతిభా ఎమ్ సింగ్ వాదనలు వినిపించారు. -
యూజర్ల సమాచారం గోప్యమే!: వాట్సాప్
న్యూఢిల్లీ: తాము ప్రవేశపెట్టిన నూతన విధానం వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భంగం కలగదని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ సంస్థ తెలిపింది. వినియోగదారుడు తన అకౌంట్‌ను తొలిగించుకున్న తర్వాత వారి సమాచారం సర్వర్‌లో ఉండదని పేర్కొంది. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది.