అతను నాకు ఎప్పటికీ స్ఫూర్తి: హృతిక్ | Hrithik Roshan Says This Actor is an Insipration For Him | Sakshi
Sakshi News home page

అతను నాకు ఎప్పటికీ స్ఫూర్తి: హృతిక్

Published Wed, Aug 26 2015 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

అతను నాకు ఎప్పటికీ స్ఫూర్తి: హృతిక్

అతను నాకు ఎప్పటికీ స్ఫూర్తి: హృతిక్

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ను మరో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన తనకు స్ఫూర్తి అని చెప్పారు. సినీ పరిశ్రమలో తనకు తెలిసిన అతికొద్దిమంది మంచివాళ్లలో కునాల్ కపూర్ ముందుంటారని తెలిపారు. రంగ్ దే బసంతి అనే ఒక్క చిత్రం ద్వారా కునాల్ అంటే ప్రపంచం మొత్తానికి తెలిసిందని, ఆయన నటన అద్భుతం అని కొనియాడారు.

కునాల్ కపూర్ తాజాగా నటించిన చిత్రం 'కౌన్ కిత్నే పానీ మెయిన్'. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన హృతిక్ కాసేపు మీడియాతో మాట్లాడారు. తాను నటనలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నా నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడని పేర్కొన్నారు. ఈ చిత్రం కునాల్కు ఘన విజయాన్ని అందించాలని ఆశిస్తున్నానని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement