14 ఏళ్ల తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న బ్యూటీ! | South actress Trisha returns to Bollywood after 14 years | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల తర్వాత అక్కడికి..? ఆ స్టార్‌ హీరోకు జంటగా!

Published Wed, Jul 17 2024 1:12 PM | Last Updated on Wed, Jul 17 2024 1:20 PM

South actress Trisha returns to Bollywood after 14 years

వయసు పెరుగుతున్న కొద్ది, అందంతో పాటు అవకాశాలు పెరుగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. కెరీర్‌ దాదాపు ఎండ్‌ అయ్యిందనుకుంటున్న పరిస్థితుల్లో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో త్రిష మళ్లీ పూర్వవైభవాన్ని అందుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలే అవకాశాలు. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటించిన గోట్‌ చిత్రంలో ఐటం సాంగ్‌కు డాన్స్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇకపోతే అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్‌ చిత్రంలోనూ, తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్‌ వంటి చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా మరోసారి బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారన్నది తాజా సమాచారం. అక్కడ సంచలన స్టార్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌తో రొమాన్స్‌ చేయనున్నట్లు తెలిసింది. దీన్ని కోలీవుడ్‌ దర్శకుడు విష్ణువర్ధన్‌ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈయన ప్రస్తుతం దివంగత ప్రముఖ నటుడు మురళీ రెండవ వారసుడు ఆకాశ్‌మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నేసిప్పాయా అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నటి అదితి శంకర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. 

దీంతో దర్శకుడు విష్ణువర్థన్‌ బాలీవుడ్‌ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటి త్రిష కథానాయకిగా నటించనున్నట్లు అనధికారిక వార్త. ఈ చిత్రానికి ది బుల్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. చిత్రం తొలి షెడ్యూల్‌ను స్పెయిన్‌ దేశంలో నిర్వహించనున్నట్లు, ఇందులో నటి త్రిష పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ బ్యూటీ 14 ఏళ్ల క్రితం ఖట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ప్రియదర్శన్‌ ఈమెను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. నటుడు అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం 2010లో విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో త్రిష ఆ తరువాత కన్నెత్తి చూడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు దర్శకుడు విష్ణువర్ధన్‌ మరోసారి ఈమెను బాలీవుడ్‌కు తీసుకెళ్లుతున్నారన్న మాట.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement