థగ్‌లైఫ్‌ షూటింగ్‌లో ప్రమాదం | Actor Joju George Injured In Thug Life Movie Sets While Shooting Helicopter Scene, Deets Inside | Sakshi
Sakshi News home page

థగ్‌లైఫ్‌ షూటింగ్‌లో ప్రమాదం

Published Fri, Jun 14 2024 7:02 AM | Last Updated on Fri, Jun 14 2024 9:37 AM

Actor Joju George Injured In Thug Life Movie Sets

సినీ నటులకు సుఖాలే కాదు, కష్టాలు ఎదురవుతుంటాయి. పలువురు నటీనటులు షూటింగ్‌లో ప్రమాదాలకు గురైన సంఘటలను ఉన్నాయి. కాగా తాజాగా కమల్‌హాసన్‌ చిత్రం థగ్‌లైఫ్‌ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. నటుడు కమలహాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం థగ్‌లైఫ్‌. నటుడు శింబు, త్రిష, మలయాళ నటుడు జోజూ జార్జ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  

ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పుటికే రాజస్థాన్, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో జరుపుకుని, 60 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ  జరుగుతోంది. అక్కడ  నటుడు కమలహాసన్‌ ప్రతినాయకులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచి మలయాళ నటుడు జోజూ జార్జ్‌ కిందికి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలి ఎముఖ విరిగిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. 

దీంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. దీంతో ఆయన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి పంపించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా థగ్‌లైఫ్‌ చిత్రం తదుపరి షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఐరోపాకు బయలుదేరనున్నట్లు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement