హీరోయిన్ త్రిషకి ఎంత వద్దనుకున్నా కష్టాలు తప్పట్లేదు. మొన్నీ మధ్యే నటుడు మన్సూర్‌తో జరిగిన గొడవంతా ముగిసిందనుకునేలోపు.. మరో విషయంలో ఈ ముద్దుగుమ్మ టార్గెట్ అయిపోయింది. ఈసారి మాజీ ఎమ్మెల్యే రాజు అనవసర కామెంట్స్ చేశారు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి త్రిషని రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగారు. అసలు ఈ ఎమ్మెల్యే ఎందుకిలా మాట్లాడారు? కారణం ఏమై ఉంటుంది?
సినీ ప్రేక్షకులు.. హీరోహీరోయిన్ల గురించి నోటికొచ్చింది మాట్లాడారంటే వాళ్లకు ఏం తెలుసులే అనుకోవచ్చు. తమిళనాడులో మాత్రం స్వయనా పలువురు నటులు, రాజకీయ నాయకులే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సింగర్ చిన్మయి, నయనతార విషయంలో నటుడు రాధావరి గతంలో ప్రవర్తించిన తీరు, చేసిన కామెంట్స్ పై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. అయితే నయనతార మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఈ తరహా సంఘటనలు జరిగాయి.
(ఇదీ చదవండి: రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!)
తాజాగా తమిళ సినిమాల్లో త్రిష కాస్త మళ్లీ క్రేజ్‌తో దూసుకెళ్తోంది. 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' సినిమాలతో గతేడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో ఈమెపై ఏదో ఓ కామెంట్ చేసేసి ఫేమస్ అయిపోవచ్చనో ఏమో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత రాజు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అసలు సందర్భమే కాదు. తీరా తనపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చేసరికి క్షమాపణ చెప్పేశారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు.
పైన జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే తమిళనాడులోని కొందరు వ్యక్తులు.. కావాలనే ఫేమ్ ఉన్న హీరోయిన్లపై చిల్లర కామెంట్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తద్వారా కొన్నాళ్ల పాటు తాము వార్తల్లో ఉండొచ్చు, నలుగురు తమ గురించి మాట్లాడుకుంటారనే ఆలోచిస్తున్నారమో? అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది.
(ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్)
Comments
Please login to add a commentAdd a comment