AIDMK MLAs
-
వరసగా టార్గెట్ అయిపోతున్న త్రిష.. అసలు కారణం అదేనా?
హీరోయిన్ త్రిషకి ఎంత వద్దనుకున్నా కష్టాలు తప్పట్లేదు. మొన్నీ మధ్యే నటుడు మన్సూర్‌తో జరిగిన గొడవంతా ముగిసిందనుకునేలోపు.. మరో విషయంలో ఈ ముద్దుగుమ్మ టార్గెట్ అయిపోయింది. ఈసారి మాజీ ఎమ్మెల్యే రాజు అనవసర కామెంట్స్ చేశారు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి త్రిషని రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగారు. అసలు ఈ ఎమ్మెల్యే ఎందుకిలా మాట్లాడారు? కారణం ఏమై ఉంటుంది? సినీ ప్రేక్షకులు.. హీరోహీరోయిన్ల గురించి నోటికొచ్చింది మాట్లాడారంటే వాళ్లకు ఏం తెలుసులే అనుకోవచ్చు. తమిళనాడులో మాత్రం స్వయనా పలువురు నటులు, రాజకీయ నాయకులే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సింగర్ చిన్మయి, నయనతార విషయంలో నటుడు రాధావరి గతంలో ప్రవర్తించిన తీరు, చేసిన కామెంట్స్ పై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. అయితే నయనతార మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఈ తరహా సంఘటనలు జరిగాయి. (ఇదీ చదవండి: రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!) తాజాగా తమిళ సినిమాల్లో త్రిష కాస్త మళ్లీ క్రేజ్‌తో దూసుకెళ్తోంది. 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' సినిమాలతో గతేడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో ఈమెపై ఏదో ఓ కామెంట్ చేసేసి ఫేమస్ అయిపోవచ్చనో ఏమో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత రాజు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అసలు సందర్భమే కాదు. తీరా తనపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చేసరికి క్షమాపణ చెప్పేశారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. పైన జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే తమిళనాడులోని కొందరు వ్యక్తులు.. కావాలనే ఫేమ్ ఉన్న హీరోయిన్లపై చిల్లర కామెంట్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తద్వారా కొన్నాళ్ల పాటు తాము వార్తల్లో ఉండొచ్చు, నలుగురు తమ గురించి మాట్లాడుకుంటారనే ఆలోచిస్తున్నారమో? అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) -
వారసుడి ఎంపికలో ప్రతిష్టంభన
చెన్నై: జయలలిత వారసుడి ఎంపిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో జయ విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వంకు పూర్తి మద్దతు దక్కలేదని సమాచారం. జయ వారసుడిని ఎంపిక చేసేందుకు మళ్లీ సమావేశం కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మధ్యాహ్నం సమావేశమైన ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను తమ నాయకుడిగా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు జయలలితకు రాత్రి 11 గంటలకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నివేదికలు పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు మరోసారి ప్రకటన చేయనున్నారు. అపోలో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలు నిలిచిపోయాయి. కాగా, తమిళనాడులో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో చెప్పారు. తమిళనాడులోని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. -
కాసేపట్లో కీలక ప్రకటన?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన వెలువడే అవకాశముందని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. జయ అనారోగ్యంపై 6 గంటలకు ముఖ్య ప్రకటన వెలువడనుందని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి తెలిపారు. అన్నాడీఎంకే వర్గాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి చుట్టుపక్కల భద్రతను అత్యంత కట్టుదిట్టం చేయడంతో ‘అమ్మ’ మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. చెన్నైలో 15 వేల మంది పోలీసులను మోహరించారు. ఒక్క అపోలో ఆస్పత్రి వద్దే 5 వేల మంది పోలీసులను దించారు. మరోవైపు సాయంత్రం 6.15 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరోసారి భేటీ అవుతున్నారు. అగ్ర నాయకులు తమిళనాడుకు వస్తుండడం అనుమానాలు రేకిత్తిస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు చెన్నైకు వస్తున్నట్టు సమాచారం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోలీసు అధికారులు విధుల్లోనే ఉండాలని చెన్నై పోలీసు కమిషనర్ ఆదేశించారు. 75 శాతం మంది సిబ్బంది రోడ్లపైనే ఉండాలన్నారు. అన్నిచోట్లా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
జయ వారసుడిపై క్లారిటీ?
-
జయ వారసుడిపై క్లారిటీ?
చెన్నై: అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సోమవారం అత్యవసరంగా అపోలో ఆస్పత్రిలో భేటీ అయ్యారు. ‘అమ్మ’ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో తదుపరి నాయకత్వంపై చర్చించినట్టు సమాచారం. జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. పన్నీరు సెల్వంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు సమాచారం. గతంలో జయకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రకటన చేయాలని ఎమ్మెల్యేల సమావేశంలో తీర్మానించారు. అయితే ప్రకటనకు ముందు ఆస్పత్రి వర్గాలు కొన్ని షరతులు పెట్టాయి. వీటిపై ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నాయి. జయ ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యేలకు వైద్యులు వివరించారు. తాము ఎంత కష్టపడ్డా జయ ఆరోగ్యం విషమంగానే ఉందని తెలిపారు. ఆమెకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు అపోలో ఆస్పత్రికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. కాగా, సాయంత్రం 6.15 గంటలకు మరోసారి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.