కోలీవుడ్ టాప్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి గాయని సుచిత్ర సెన్సేషనల్ కామెంట్లు చేసింది. గత కొన్నిరోజుల క్రితం వారిద్దరి మధ్య పలు రూమర్స్ రావడంతో కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరుచూ వారిద్దరూ విదేశాలకు ట్రిప్స్ వేస్తున్నారంటూ కొన్ని ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేశారు. కానీ, విజయ్ ఫ్యాన్స్ వాటిని తిప్పికొట్టారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని వారు కౌంటర్ ఇచ్చారు.
విజయ్, త్రిష బంధం గురించి తాజాగా సుచిత్ర ఇలా చెప్పుకొచ్చింది. విజయ్ ఆయన సతీమణి సంగీత తిరిగి ఎప్పుడో కలవాలి. అహంభావంతో చిన్నపాటి గొడవలతో వారి కుటుంబం చితికిపోయింది. ఇలాంటి సమయంలో త్రిష లాంటి పరాన్నజీవులు ఇతరుల జీవితాల్లోకి ప్రవేశిస్తారు. లిఫ్ట్‌లో సీక్రెట్‌గా తీసిన ఫోటోను ఆమె పోస్ట్ చేసినప్పటి నుంచి వారి గురించి చర్చ ఎక్కువ నడుస్తుంది. త్రిషకు కావాల్సింది కూడా ఇదే. విజయ్‌కు ఆమె దగ్గరగా ఉండాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఎం.జి.ఆర్. - జయలలితను వారిద్దరితో పోలుస్తున్నారు.
ఎంజీఆర్‌కు జయలలిత పరాన్నజీవి. ఎంజీఆర్ నుంచి రాజకీయాలపై పట్టు సాధించిన ఆమె ఆ తర్వాత ఎంజీఆర్‌ను విస్మరించారు. ఈ విషయంలో కరుణానిధి తాత కూడా ఈ పశ్చాత్తాపాన్ని అనుభవించారు. తన స్నేహితుడైన ఎంజీఆర్‌ను ఇలా నాశనం చేయడం వల్లే కరుణానిధికి జయలలిత నచ్చలేదు.
ఎంజీఆర్ మరణానంతరం జయలలిత రాజకీయాల్లో మాత్రం బాగానే చేశారు. ప్రజలకు మంచి పాలనే అందించారు. రాజకీయంగా తమిళనాటలో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర ఆమె వేశారు. అయితే, ఇప్పుడు అలాగే విజయ్‌ను త్రిష ఫాలో కావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన గెలిచే అవకాశమే లేదు. ఇంకా ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదు. రాజకీయాల్లో ఉండాలనే సలహాలు విజయ్‌కు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇవన్నీ చాలా తప్పుడు సలహాలు. అని సుచిత్ర తన వీడియోలో మాట్లాడింది.
అయితే, విజయ్, త్రిషలను ఎంజీఆర్-జయలలితతో పోల్చడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తెలివి లేకుండా చనిపోయిన ఇద్దరు దిగ్గజాల గురించి నోటికొచ్చింది మాట్లాడటం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమెను పిచ్చి ఆసుపత్రిలో చేరిపించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. విజయ్, ఆయన భార్య సంగీత ఫోటోలు బయటకు వస్తేనే ఇలాంటి వివాదాలకు తెరపడుతుందని నెటిజన్లు అంటున్నారు. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహ బంధం ఉంటే రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment