
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. హర్యానాకు చెందిన ఈ బ్యూటీ వైద్య విద్యను అభ్యసించి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. అందాల పోటీల్లో పాల్గొని ప్రాచుర్యం పొందిన తర్వాత 2019లో బాలీవుడ్‌లో నటిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత అక్కడ అవకాశాలు రాకపోయినా టాలీవుడ్ అమ్మడికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది.
(ఇది చదవండి: బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్.. అతడి భయమే నిజమైంది!)
‘ఇక్క డ వాహనాలు నిలుప రాదు’ అనే తెలుగు చిత్రంలో మెరిసిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. ఆయనతో జత కట్టిన గుంటూరు కారం చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సంక్రాంతికి తెరపైకి మరో రెండు, మూడు తెలుగు చిత్రాలు చేతిలో వున్నాయి.
కాగా కొలై అనే చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. నటుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కీలకపాత్ర పోషించి గుర్తింపు పొందారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్ సరసన కథానాయకిగా నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ కోసం ఈ బ్యూటీ ఇప్పుడు థాయ్‌లాండ్ చేరుకున్నారు. కాగా అంతకుముందే దుబాయ్‌కు వెళ్లి అక్కడి ఎడారి ప్రాంతంలో అందాలను ఒలకబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. వివిధ భంగిమలతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
(ఇది చదవండి: కీడా కోల, మా ఊరి పొలిమేర 2.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment