
దళపతి, తమిళ స్టార్ హీరో విజయ్‌తో జత కట్టే అవకాశం అంత సులభంగా రాదు. అలా వచ్చిందంటే ఆమె లక్కీ హీరోయినే. తాజాగా ఆ ఛాన్స్ గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరిని వరించింది. విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్‌ఆల్ టైం(GOAT). ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అయితే తాజాగా విజయ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. విజయ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్‌తో కలిసి ఓ పాటకు డాన్స్ చేయనున్నట్లు దర్శకుడు ముందుగా చెప్పగానే నాకు దడ మొదలైందని అన్నారు. దీనికి కారణం ఆయన గొప్ప డాన్సర్ కావడమేనని పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం తనతో చాలా ఉన్నతంగా నడచుకున్నారని చెప్పారు. ఆయనకు తాను కూడా వీరాభిమానిని అన్నారు గుంటూరు కారం భామ. విజయ్ షూటింగ్ స్పాట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని.. చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభవమని పేర్కొన్నారు. కాగా.. మైక్ మోహన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, ప్రేమ్‌జీ, వైభవ్ అరవింద్ ఆకాష్, నటి స్నేహ, లైలా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇక మీనాక్షి సినిమాల విషయాకొనిస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇంతకుముందే విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై చిత్రంలో కీలక పాత్రను పోషించారు. అదే విధంగా ఆర్‌జే బాలాజీ సరసన నటించిన సింగపూర్ సెలూన్ చిత్రం ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment