రాంబిల్లి: కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సీతపాలెం తీరానికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచి్చంది. ఎస్‌ఐ అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేసి పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం దాకా మృతదేహం కోసం ఎవరూ రాలేదు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది.
మృతదేహం తరలింపునకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్ స్పందించారు. ఏఎస్‌ఐ దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు చూపిన మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.
డీజీపీ అభినందనలు:
పోలీసుశాఖ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతున్న సిబ్బందికి సలాం చేస్తున్నానని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సమాజ సేవలోనూ ముందుంటామని చాటిన రాంబిల్లి పోలీసులను అభినందించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల మేర భుజాలపై మోసి రాంబిల్లి పోలీసులు మానవత్వం చాటారు అని చెప్పారు. రాంబిల్లి పోలీసులకు యావత్ భారతం ప్రశంసలతో ముంచెత్తుతోందని తెలిపారు. అదే విధంగా రాంబిల్లి ఎస్ఐ, సిబ్బందికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
చదవండి: చిట్టితల్లికి కష్టమొచ్చింది
Comments
Please login to add a commentAdd a comment