
నిజామాబాద్: మండల కేంద్రం శివారులోని చెరువు సమీపంలో గోనె సంచి మూట బుధవారం కలకలం రేపింది. మూటలో మృతదేహం ఉందని అనుమానించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి హుటాహూటిన చేరుకున్నారు. గోనె సంచి మూటను తెరువగా అందులో కుక్క మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఇలా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment