వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు
శాఖల మధ్య సమన్వయ లోపం
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్
ఇసుక క్వారీ వద్ద టిప్పర్ల యజమానులు, డ్రైవర్లతో మాట్లాడుతున్న రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్
రెవెన్యూ అధికారులు జారీ చేసిన వే బిల్లు
బోధన్ : నిబంధనలు అతిక్రమిస్తూ ఇసుక తరలించడంపై సాక్షి జిల్లా పేజీలో ‘ఓవర్ లోడ్’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బోధన్ మండలంలోని సిద్ధాపూర్–ఖండ్‌గాం గ్రామాల మధ్య ఉన్న ఇసుక క్వారీని రోడ్డు రవాణా శాఖ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్, బోధన్ ఎంవీఐ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్ పరిశీలించారు. క్వారీ నుంచి పరిమితికి మించి టిప్పర్లల్లో ఇసుక రవాణా చేస్తుండటంపై సీరియస్ అయ్యారు. ఓవర్‌లోడ్ చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. క్వారీ వద్ద నుంచే బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను ఫోన్‌లో సంప్రదించి పరిస్థితిని వివరించారు. దీంతో ఓవర్‌లోడ్ అంశంపై శనివారం సబ్ కలెక్టర్ సమక్షంలో రోడ్డు రవాణా, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంవీఐ శ్రీనివాస్ తెలిపారు.
అభివృద్ధి పనుల కోసమే..
బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్, బోధన్ మండలాల్లో అభివృద్ధి పనుల కోసం సిద్ధాపూర్– ఖండ్‌గాం గ్రామాల మధ్య మంజీర నదిలో ఇసుక క్వారీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి కూడా ఇసుక తరలించేందుకు రెవెన్యూ అధికారులు వే బిల్లులు ఇస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 10 క్యూ బిక్ మీటర్ల(15 టన్ను లు) ఇసుక లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే టిప్పర్ బాడీని ఇనుపరేకులు, కర్ర చెక్కలతో పెంచి పెద్ద మొత్తంలో ఇసుక తరలిస్తున్నారు. కాగా, క్వారీ వద్ద వే బిల్లులు జారీ చేసేందుకు మండల రెవెన్యూ అధికారి ఒక్కడే ఉండటం విశేషం.
ఖలీల్‌వాడి : ప్రభుత్వం నుంచి ఒక్క వే బిల్లు తీసుకొని.. నాలుగు టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు. ఇసుక వ్యాపారులంతా రింగ్‌గా ఏర్పడి అనుమతికి మించి ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్ధాపూర్ వద్ద గల ఖండ్‌గాం క్వారీ, మందర్నా క్వారీ నుంచి ఒ క్కో టిప్పర్‌లో 10 టన్నుల ఇసుక తరలింపునకు వ్యాపారులు మీ సేవలో రూ.4వేల వరకు వే బిల్లు చెల్లిస్తారు. కానీ, టిప్పర్‌కు పైన చెక్కలు అమర్చి 25 టన్నుల వరకు ఇసుక తోడేస్తున్నారు. అధికారులతో టిప్పర్ల యజమానులు మిలాఖత్ అవ్వడంతోనే ఇష్టారీతిన ఇసుక తరలిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ దందాపై అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. బోధన్ రూరల్, సాలూరా, నవీపేట, ఎడపల్లి, 6వ టౌన్, ఐదో టౌన్‌ల మీదుగా పరిమితికి మించి ఇసుక తరలిస్తున్న టిప్పర్లతో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేస్తే ఎస్సైలు లేరని సిబ్బంది చెప్పడం కొసమెరుపు.
ఇసుక కోసమే ఓ పోలీస్ అధికారికి బదిలీ
జిల్లాలో పనిచేసే ఓ పోలీస్ అధికారి ఇసుక ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం కోసమే రాజకీయ నాయకుని పైరవీతో అక్కడికి బదిలీ చేయించుకున్నట్లు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు పోలీసు అధికారిని ఇసుక వ్యాపారులు ముందుగానే కలవడంతో ఇసుక అక్రమ వ్యాపారాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.
ఖలీల్‌వాడి: పరిమితికి మించి ఇసుక తరలింపు తో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని ఇన్‌చార్జి సీపీ కార్యాలయంతోపాటు ఆర్టీఏ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు నిజామాబాద్ లారీ ఓనర్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అసోసియేష న్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, లింగారెడ్డి పేర్కొన్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. 10 టన్నులు తరలించే టిప్పర్‌లో 25 నుంచి 28 టన్నుల ఇసుక తరలిస్తున్నారని, దీంతో ఒక్క ట్రిప్పునకు రూ. 6వేల నుంచి 8వేల వరకు ఆదాయం తగ్గుతోందని తెలిపారు. సమావేశంలో పవన్‌రెడ్డి, శివారెడ్డి, నాగేశ్, ఎస్‌కే ఖయ్యూం, ఇమ్రాన్ మాజార్ పటేల్, నర్సింహ, నవీన్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి కథనంపై ప్రస్తావన
ఇసుక ఓవర్‌లోడ్‌పై సాక్షిలో వచ్చిన వార్తా కథనాలు వాస్తవమేనని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇసుక అక్రమ తరలింపుపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వాట్సాప్ గ్రూపులలో ‘సాక్షి’ కథనాన్ని పోస్టు చేశారు.
ఒక్క వే బిల్లుపైనే ఇసుక
ఒక్క వే బిల్లు మీదనే ఇసుకను అందిస్తున్నాం. ఒకేదాని మీద రెండు, మూడు వెళ్లడం లేదు. టి ప్పర్ల లైన్ రావడానికే సమయం పడుతుంది. ని బంధనల మేరకు ఇసుక తరలింపునకు అనుమతిస్తున్నాం. – విఠల్, తహసీల్దార్, బోధన్
పరిమితి కంటే ఎక్కువ తరలింపు
పరిమితి కంటే ఎక్కువగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు ఇప్పటికై నా దృష్టిసారించాలి. – లింగారెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్
తగ్గేదేలే..
ఇసుక క్వారీని సందర్శించిన అధికారులు ఓవర్ లోడ్‌పై హెచ్చరించినా వ్యాపారులు వెనక్కి తగ్గడం లేదు. అధికారులు క్వారీ నుంచి వెళ్లగానే యథావిధిగా ఇసుక ఓవర్ లోడ్‌తో టిప్పర్లు బయలుదేరాయి. అధికారుల హెచ్చరికలనూ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కాగా, శుక్రవారం డీడీలు కట్టిన 61 టిప్పర్లలో ఇసుక రవాణా చేసేందుకు రెవెన్యూ అధికారులు వే బిల్లులు జారీచేశారు.
సాక్షి కథనానికి స్పందించిన అధికారులు
ఖండ్‌గాం ఇసుక క్వారీ పరిశీలన
ఉల్లంఘనలపై ఉదయం
అధికారుల హెచ్చరికలు
మధ్యాహ్నం యథావిధిగా
ఓవర్‌లోడ్‌తో వెళ్లిన ఇసుక టిప్పర్లు
నియంత్రణపై నేడు సబ్ కలెక్టర్
సమక్షంలో సమావేశం
ఇసుక రవాణా విషయంలో దృష్టి సా రించాల్సిన వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపమే అక్రమార్కులకు రాచమార్గంగా మారినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వాదాయానికి భారీ గండిపడుతోంది. నిర్దేశిత సరిహద్దులు దాటి వస్తున్నా ఇసుక టిప్పర్ల విషయంలో మైనింగ్ శాఖ అధికారు ల్లో చలనం లేకుండా పోయిందని ఓ శాఖ డివిజన్ అధికా రి చెప్పుకొచ్చారు. క్వారీ వద్దనే ఇసుక లోడ్ తూకం వేస్తే ఓవర్‌లోడ్‌కు చెక్ పెట్టొచ్చని ఆర్టీవో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేశాం
నిజామాబాద్ లారీ ఓనర్స్, బిల్డింగ్
మెటీరియల్స్ అసోసియేషన్
వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు
వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు
వే బిల్లు ఒకటి.. ట్రిప్పులు నాలుగు
Comments
Please login to add a commentAdd a comment