విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
ఇందల్వాయి: నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సమ్మర్ యాక్షన్ చేపట్టినట్లు జిల్లా విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ రమేశ్ తెలిపారు. సిర్నాపల్లి సబ్‌స్టేషన్‌లో రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు ఎక్స్‌టెన్షన్లు, రెండు బ్రేకర్లు, గౌరారం నుంచి సిర్నాపల్లి సబ్‌స్టేషన్ వరకు రూ.69 లక్షలతో చేపట్టిన 33 కేవీ లింక్‌లైన్ పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. నల్లవెల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక 100 కేవీ, మూడు 25కేవీల ట్రాన్స్‌ఫార్మర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి డీఈ ఉత్తం జాడే, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ జ్ఞానేశ్వర్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు జిల్లాకు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సుభాష్‌నగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి శనివారం జిల్లాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ పట్టభద్రులతో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కేంద్రమంత్రితోపాటు ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొంటారని తెలిపారు.
లింగ నిర్ధారణ చేయొద్దు
● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్‌నాగారం: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ హెచ్చరించారు. జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ సెంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తామన్నారు. గర్భిణులకు స్కానింగ్ చేసి పుట్టబోయే శిశువు ఆడ లేదా మగ అని తెలియజేస్తే చట్టప్రకారం స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత గల డాక్టర్ రిఫరల్ స్లిప్పు లేనిదే అబార్షన్ కోసం వాడే ఔషధాలను విక్రయించొద్దని మెడికల్ షాపులకు సూచించారు. స్కానింగ్ సెంటర్లలో రికార్డులు, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లల ప్రాధాన్యత, బేటీ బచావో బేటీ పఢావోపై విస్తృత అవగాహన కల్పించాలని ఐకేపీ, మెప్మాలతోపాటు వైద్య సిబ్బందికి సూచించారు. సమావేశంలో రేడియాలజిస్ట్ డాక్టర్ ద్వితీ, పిల్లల వైద్యులు పి ప్రసన్న, గైనకాలజిస్ట్ డాక్టర్ బి బిందు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుప్రియ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, వెంకటేశ్వర్లు (ఆరోగ్య చైతన్య వేదిక ఘన్‌పూర్), మాధురి (మెప్మా), డెమో నాగలక్ష్మి, డీహెచ్‌ఈ వేణుగోపాల్, దేవేందర్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
Comments
Please login to add a commentAdd a comment