ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచార వేడి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచార వేడి

Published Sat, Feb 22 2025 1:35 AM | Last Updated on Sat, Feb 22 2025 1:35 AM

-

జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఓటర్ల వివరాల పట్టిక..

జిల్లా మొత్తం ఓటర్లు

కుమురం భీం ఆసిఫాబాద్‌ 470

మంచిర్యాల 1664

ఆదిలాబాద్‌ 1593

నిర్మల్‌ 1966

నిజామాబాద్‌ 3751

కామారెడ్డి 2011

జగిత్యాల 1769

పెద్దపల్లి 1111

కరీంనగర్‌ 4305

రాజన్న సిరిసిల్ల 950

సంగారెడ్డి 2690

మెదక్‌ 1347

సిద్దిపేట 3212

హన్మకొండ 166

జయశంకర్‌ భూపాలపల్లి 83

మొత్తం 27,088

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రెండు రకాల ఎన్నికలు కావడంతో సహజంగానే అత్యధిక ఓటర్లుండే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీ వి షయమై హడావుడి ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అలాగే పోలింగ్‌ సమీపిస్తుండడంతో పరిమిత సంఖ్యలో ఓట్లు ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక విషయమై ఉపాధ్యాయులు, సంఘాల్లో హడావుడి నెలకొంది. ఉపాధ్యాయ ఓట్లు మొత్తం 27,088 ఉన్నాయి. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌లో 8,384, మెదక్‌లో 7,249, నిజామాబాద్‌లో 5,762, ఆదిలాబాద్‌లో 5,693 ఓట్లు ఉన్నాయి. ఓట్లర్లలో పురుషు లు 16,932 మంది, మహిళలు 10,156 మంది ఉ న్నారు. ఈ నెల 27న పోలింగ్‌ జరుగనుంది. బరిలో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే ఒ క రాజకీయ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థి ఒక్కరే కా వడం గమనార్హం. జాతీయ పార్టీ బీజేపీ నుంచి వి ద్యావేత్త మల్క కొమరయ్య పోటీలో ఉన్నారు. కా గా మల్క కొమరయ్య, పీఆర్‌టీయూ బలపరిచిన అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, ఎస్‌టీయూ, సీపీ ఎస్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌ మద్దతుతో బరిలోకి దిగిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, టీపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, యూఎస్‌పీసీ బలపరిచిన అశోక్‌ కుమార్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీరితో పా టు మరో 11 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.

కులాల వారీగా సమీకరణలు..

పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో విందులు, ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమయ్యా యి. ఈ క్రమంలో ఉపాధ్యాయులు కులాల వారీగా విడిపోయి అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేవిధంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన నేపథ్యంలో బీసీ వాదంతో అత్యధిక మంది ఉపాధ్యాయులు ప్రచార పర్వా న్ని నడిపిస్తున్నారు. దీంతో మల్క కొమరయ్యకు బీసీ ఉపాధ్యాయుల నుంచి మద్దతు వస్తోంది. మ రోవైపు బీజేపీ అభ్యర్థి కూడా కావడంతో మల్క కొ మరయ్య గెలుపు కోసం సంఘ్‌పరివార్‌ భారీగా కసరత్తు చేస్తోంది. పీఆర్‌టీయూ అభ్యర్థిగా బరిలో ఉన్న వంగ మహేందర్‌రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నప్పటి కీ ఇదే సంఘం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గె లుపొందిన సిట్టింగ్‌ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి భా రీగా ఓట్లను చీల్చనున్నట్లు పలువురు విశ్లేషిస్తున్నా రు. ఉపాధ్యాయుల మధ్య కులాల వారీగా డివిజన్‌ వచ్చిన నేపథ్యంలో బీజేపీ తరఫున అభ్యర్థిగా ఉన్న కొమరయ్యకు కలిసొస్తుందని ఆ పార్టీ శ్రేణులు చె బుతున్నాయి. బీసీ కులగణన నేపథ్యంలో ఈ వా దం సైతం తమకు కలిసొస్తుందని బీజేపీ కార్యకర్త లు అంటున్నారు. మరోవైపు వంగ మహేందర్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, అశోక్‌కుమార్‌ సైతం తమకే అవకాశాలున్నాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్‌కు మిగిలింది ఐదురోజులే..

ఆత్మీయ సమ్మేళనాలతో హడావుడి

మొత్తం ఓట్లు 27,088 మాత్రమే.. కూడికలు, తీసివేతలతో అభ్యర్థులు

కులాల వారీగా ఓట్ల సమీకరణలు చేస్తున్న ఉపాధ్యాయులు

మల్క కొమరయ్య రాజకీయ పార్టీ అభ్యర్థి కావడంతో పెరిగిన ఆసక్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement