ఎమ్మెల్సీ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్‌అర్బన్ : శాసనమండలి ఎన్నికల పో లింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి, ఇతర ఎ న్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల తరలింపు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరి చూసుకోవాలని తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. వీసీలో ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, అదనపు డీసీపీ కె రామచంద్రారావు, ఏసీపీ రాజావెంకటరెడ్డి, డీటీడబ్ల్యూవో నాగురావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment