
మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొస్తున్న అధికారులు
భామిని: కరోనా అనుమానిత లక్షణాలతో బత్తిలి గ్రామానికి చెందిన వ్యక్తి(39) శుక్రవారం మృతి చెందడంతో రోజంతా హైడ్రామా నెలకొంది. అంత్యక్రియలకు గ్రామస్తులు అడ్డుకోవడంతో అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని ఉంచి రోజంతా తిప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గ్రామంలోని నాలుగు శ్మశానవాటికలకు తీసుకెళ్లినా అడ్డుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఎంపీడీవో నిమ్మల మాసన్, తహసీల్దార్ బోడిసింగి సురేష్, కార్యదర్శి ఆర్‌ఎన్ భట్టు, అశోక్‌సాహూ గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నాలు చేశారు.
చివరికి మృతుడి వ్యవసాయ పొలంలోనే ఖననం చేయాల్సి వచ్చింది. శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కొత్తూరు సీహెచ్‌ఎన్‌సీకి తరలించగా వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. ఉన్నతాధికారులు అనుమతితో మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా గుర్తించారు. కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతూ ప్రైవేటు వైద్యం పొందుతుండగా కరోనా సోకినట్లు భావిస్తున్నారు. మృతుడి అక్కాబావ రెడ్‌జోన్ నుంచి వచ్చి బాధితుడిని కలవడం వల్ల వారికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment